Rajinikanth : తమిళనాడులోనే అత్యధిక ట్యాక్స్ పే చేసిన వ్యక్తిగా రజినీకాంత్.. సత్కరించిన ఐటీ డిపార్ట్మెంట్..

కొన్ని సంవత్సరాలుగా తమిళనాడులో అత్యధిక ట్యాక్స్ కడుతున్నందుకు ఐటీ డిపార్ట్మెంట్ ఇటీవల ఇన్కమ్ ట్యాక్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రజినీకాంత్ ని సత్కరించాలని.....

Rajinikanth : తమిళనాడులోనే అత్యధిక ట్యాక్స్ పే చేసిన వ్యక్తిగా రజినీకాంత్.. సత్కరించిన ఐటీ డిపార్ట్మెంట్..

Rajinikanth

Rajinikanth :  ఒక బస్సు కండెక్టర్ స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఎదిగి స్టార్ హీరోగా మారారు రజినీకాంత్. సూపర్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నారు. సినిమాలకి రెమ్యునరేషన్ కూడా ఎక్కువే తీసుకుంటారు రజినీకాంత్. సౌత్ హీరోల్లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరో రజినీకాంత్. తాజాగా తమిళనాడులో అత్యధిక ట్యాక్స్ పే చేసే వ్యక్తిగా రికార్డు సృష్టించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సత్కారం అందుకున్నారు.

కొన్ని సంవత్సరాలుగా తమిళనాడులో అత్యధిక ట్యాక్స్ కడుతున్నందుకు ఐటీ డిపార్ట్మెంట్ ఇటీవల ఇన్కమ్ ట్యాక్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రజినీకాంత్ ని సత్కరించాలని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల రజినీకాంత్ రాకపోవడంతో ఆయన కుమార్తె ఐశ్వర్య ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై ముఖ్య అతిధిగా హాజరవ్వగా ఆమె చేతుల మీదుగా రజినీకాంత్ తరపున ఐశ్వర్య మెమెంటో అందుకున్నారు.

Tollywood : సినీ సమస్యలపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేక సమావేశం

దీనికి సంబంధించిన ఫొటోలని ఐశ్వర్య సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”అత్యధిక ట్యాక్స్ పే చేసే వ్యక్తికి కూతురిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. మా నాన్నని ఇలా సత్కరించినందుకు తమిళనాడు, పుదుచ్చేరి ఐటీ డిపార్ట్మెంట్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు” అని తెలిపింది.