Rajinikanth: కరోనాపై పోరాటానికి తలైవా.. తన వంతుగా..

Rajinikanth: కరోనాపై పోరాటానికి తలైవా.. తన వంతుగా..

Rajinikanth

కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో మరణాలు పెరిగిపోగా.. భారతదేశం పోరాడుతూనే ఉంది. ఈ అంటువ్యాధి వల్ల చాలా మంది జీవితాలు ప్రభావితం అవ్వగా.. ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వంతో పాటు సినీ తారలు కూడా తమ వంతుగా సాయం చేస్తున్నారు. కరోనా వైరస్‌తో బాధపడుతున్న ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సీఎం సహాయనిధికి రూ. 50లక్షలను అందజేశారు.

దక్షిణ భారతదేశంలో కరోనా వైరస్ కేసులు తీవ్రంగా ఉండగా.. తమిళనాడులో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ బారినపడిన ప్రజలకు సహాయం చేయడానికి సౌత్ సినిమాతో సంబంధం ఉన్న చాలా మంది తారలు ముందుకు వస్తున్నారు. కరోనా వైరస్‌తో పోరాడటానికి తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం చేశారు. సీఎం స్టాలిన్‌కు స్వయంగా చెక్కును అందించారు.

రజనీకాంత్ 50 లక్షల రూపాయలను తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చినట్లు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కోవిడ్‌ బాధితుల కోసం ఆక్సిజన్, వ్యాక్సిన్‌ వంటి వైద్య సదుపాయాలను సమకూర్చడం కోసం, మరోవైపు ఉపాధి కోల్పోయిన ప్రజలకు ఆర్థికంగా అండగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో సీఎం స్టాలిన్‌ దాతలు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేయగా.. కోలీవుడ్ కదిలి వస్తుంది.

ఇప్పటికే హీరో సూర్య కుటుంబం కోటి రూపాయలు, సౌందర్యా రజినీకాంత్‌ ఫ్యామిలీ కోటి రూపాయలు అందజేశారు. అదే విధంగా, నటుడు శివకార్తికేయన్‌ రూ.25 లక్షలు, నిర్మాత, ఎడిటర్‌ మోహన్, ఆయన కుమారులు దర్శకుడు మోహన్‌రాజ, నటుడు జయం రవి కలిసి రూ.10 లక్షలు విరాళాన్ని అందించారు. వీరంతా సీఎం స్టాలిన్‌ను కలిసి తమ వంతు సాయం అందజేశారు. హీరో అజిత్‌ సైతం రూ. 25 లక్షలు విరాళం ఇవ్వగా.. ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌, హీరో ఉదయనిధి స్టాలిన్‌లు చేరో 25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.