Rajinikanth: రజనీ ఓ సూపర్ పవర్.. అవార్డులకే రివార్డ్ ఈ తలైవా

అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్‌... ఆయనకు మాత్రమే సొంతమైన.... తను మాత్రమే చేయగల యాక్టింగ్ స్కిల్స్ ప్రేక్షకులను అలరించాడు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ప్రతీ..

Rajinikanth: రజనీ ఓ సూపర్ పవర్.. అవార్డులకే రివార్డ్ ఈ తలైవా

Rajinikanth3

Rajinikanth: అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్‌… ఆయనకు మాత్రమే సొంతమైన…. తను మాత్రమే చేయగల యాక్టింగ్ స్కిల్స్ ప్రేక్షకులను అలరించాడు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ప్రతీ భాషలోనూ చెలరేగిపోయారు. తన మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ ‘భైరవి’ రజనీ పేరుకు ముందు ‘సూపర్‌స్టార్‌’ ని తీసుకొచ్చింది. తమిళ్ రంగంలో ఫుల్ బిజీగా మారినా…తెలుగులో అడపదడపా బాలచందర్ దర్శకత్వంలో సినిమాలు చేస్తుండేవారు. అంతులేని కథతో తెలుగులో పరిచయమైనా…చిలకమ్మ చెప్పిందితో హీరోగా మారాడు. టైగర్, రామ్ రహీమ్ రాబర్ట్, ఇద్దరూ అసాధ్యులే, కాళి వంటి స్టైయిట్ తెలుగు సినిమాలతో పాటూ తమిళ్ డబ్బింగ్ చిత్రాలతో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

Rajinikanth: లెజండరీ శివాజీ ప్రయాణం. నేటి తరానికి ఆదర్శం

దళపతి, ముత్తు, భాషా, పెదరాయుడు…ఇలా వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులతో కూడా విజిల్స్ వేయించుకున్నారు. సూపర్ స్టార్ మూవీ అంటే థియేటర్స్ దద్దరిల్లేలా మార్చేసారు. అరుణాచలం, నరసింహా సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసిపారేసారు. చంద్రముఖి, రోబో, కబాలి వంటి సినిమాలతో సలాం రజనీ అని ఇప్పటికీ తన లేటెస్ట్ మూవీ అన్నాత్తేతో తెలుగు ప్రేక్షకుల ముందుకు పెద్దన్నగా రాబోతున్నాడు. సినీజీవితంలో అవార్డులు, రివార్డులకు కొదువలేదు. 2000 సంవత్సరంలో పద్మభూషణ్‌ అందుకున్న రజనీకాంత్‌… 2016లో పద్మవిభూషణ్‌ అవార్డు అందుకున్నారు. ఇప్పటి వరకు 160కి పైగా సినిమాలు చేశారు రజనీ.

Rajinikanth: నడిస్తే స్టైల్.. మాట్లాడితే కేక.. అసలేంటీ రజనీ మేనియా!

మరోవైపు తనను ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిన లత అనే అమ్మాయిని ప్రేమించి… పెళ్లాడారు రజనీకాంత్. సినిమాలకెంత ప్రాధాన్యత ఇస్తారో ఫ్యామిలితోనూ అంతే సంతోషంగా గడుపుతారు. ప్రజలకోసం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇద్దామనేది రజనీకాంత్ చిరకాల స్వప్నం. అభిమానులు కోరుకున్న ప్రకారం రాజకీయాల్లోకి వచ్చేందుకు చాలాసార్లు స్కెచ్‌ వేశారు. అప్పుడా, ఇప్పుడా అంటూ సాగిన పొలిటికల్ చర్చకు తెరదీస్తూ ఇదిగో నేనొస్తున్నానని 2020 చివర్లో ప్రకటించారు. కానీ అన్నాత్తే షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చిన తలైవా…ఆరోగ్యం సహకరించక ఆసుపత్రి పాలయ్యారు. అప్పుడే తన కూతుర్ల మాటలకు విలువనిచ్చి రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పారు. ఎంట్రీ అనగానే ఎగిరిగంతేసిన అభిమానులు…బైబై చెప్పగానే ఒప్పుకోలేదు. కానీ తన మాటలతో ఫ్యాన్స్ ని ఒప్పించి…నటుడిగానే ఆదరించమని లెటర్ రిలీజ్ చేసారు.

Rajinikanth : రజినీ కాంత్‌తో రాజమౌళి..!

అభిమానులకెప్పుడూ చేరువలోనే ఉంటారు రజనీకాంత్. నేను స్టార్ అన్న అహాన్ని ప్రదర్శించరు. రజనీకి కనపడకుండా ప్రజాసేవ చేయడం అలవాటు. గొప్ప దానగుణం ఆయనది. తన తదనంతరం సంపాదనంతా తాను స్థాపించిన ‘రాఘవేంద్ర పబ్లిక్‌ చారిటీ ట్రస్టు’కే చెందుతుందని రజనీ గతంలో బహిరంగ సభలో ప్రకటించారు. ‘రజనీకాంత్‌ కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే సంగతే అందరికీ తెలుసు. కానీ ఆయన సంపాదనలో యాభై శాతాన్ని సేవా కార్యక్రమాలకే కేటాయిస్తారన్న విషయం చాలామందికి తెలీదు’ అని రజనీకాంత్ జీవిత చరిత్రలో రచయిత ప్రస్తావించారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకుండా పారితోషకాన్ని ఇచ్చేసే అలవాటు రజనీకుంది. అందుకే ఆయనపై ఎంత ఖర్చైనా పెట్టడానికి వెనుకాడరు నిర్మాతలు. ఇలా ఒక్క సినిమా ప్రపంచంలోనే కాదు… తనకంటూ ఓ అందమైన ప్రపంచాన్ని సృష్టించుకొని ఆనందంగా గడుపుతున్న తలైవా రజనీకాంత్ అంటేనే… ఓ సూపర్ పవర్. ఆయన్ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించడం ఆ అవార్డుకే మరింత వన్నె తెస్తుందనేది అభిమానుల మాట.