Jailer Movie: రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన జైలర్.. పండగ చేసుకుంటున్న తలైవా ఫ్యాన్స్!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’కు సంబంధించిన రిలీజ్ డేట్ ను తాజాగా అనౌన్స్ చేశారు.

Jailer Movie: రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన జైలర్.. పండగ చేసుకుంటున్న తలైవా ఫ్యాన్స్!

Rajinikanth Jailer Movie Locks Release Date

Jailer Movie: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా జైలర్ చిత్రాన్ని రూపొందిస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుండి అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Jailer Movie: రాజస్థాన్‌లో ఛేజింగ్ చేస్తోన్న జైలర్.. ఫోటోలు లీక్!

అయితే, ఈ సినిమా నుండి అప్డేట్స్‌ను తక్కువగా ఇస్తూ వచ్చిన చిత్ర యూనిట్, తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. జైలర్ మూవీని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా అనౌన్స్ చేసింది జైలర్ మూవీ టీమ్. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌ను ఓ వీడియో రూపంలో ప్రకటించారు. రజినీకాంత్ స్టైలిష్ లుక్‌తో ఎంట్రీ ఇవ్వగా, ఈ చిత్రాన్ని ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Jailer Movie: ‘జైలర్’తో రొమాన్స్ కు మిల్కీ బ్యూటీ సై!

ఈ సినిమాలో రజినీకాంత్ మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, మోహన్ లాల్, తమన్నా, రమ్యకృష్ణ, సునీల్, జాకీ ష్రాఫ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.