Rajinikanth: సిస్టర్ సెంటిమెంట్‌కే సీనియర్ హీరోల ఓటు.. ఆడియెన్స్ ఏమంటారో?

ఇటీవల సీనియర్ హీరోల సినిమాలను గమనిస్తే మనకు ఓ విషయం స్పష్టం అవుతుంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లాస్ట్ మూవీ ‘పెద్దన్న’ సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక తెలుగులోనూ ఇదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తున్నారు సీనియర్ హీరోలు.

Rajinikanth: సిస్టర్ సెంటిమెంట్‌కే సీనియర్ హీరోల ఓటు.. ఆడియెన్స్ ఏమంటారో?

Rajinikanth Lal Salaam Also Based On Sister Sentiment

Rajinikanth: ఇటీవల సీనియర్ హీరోల సినిమాలను గమనిస్తే మనకు ఓ విషయం స్పష్టం అవుతుంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లాస్ట్ మూవీ ‘పెద్దన్న’ సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక తెలుగులోనూ ఇదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తున్నారు సీనియర్ హీరోలు.

Aishwarya Rajinikanth: ఘనంగా ‘లాల్ సలామ్’ పూజ కారిక్రమాలు.. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో విష్ణు విశాల్.. గెస్ట్ అప్పీరెన్స్‌లో రజిని..

మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ మూవీ కూడా సిస్టర్ సెంటిమెంట్‌తోనే వచ్చింది. ఇటీవల నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి కూడా సేమ్ జోనర్ మూవీ. అంతేగాక, చిరు నటిస్తున్న భోళాశంకర్ మూవీ కూడా ఇదే సెంటిమెంట్‌తో రానుంది. అయితే ఇప్పుడు మరో సీనియర్ హీరో రజినీకాంత్ కూడా ఇదే సెంటిమెంట్‌తో రాబోతున్నాడు. లాల్ సలామ్ అనే సినిమాలో నటిస్తున్న రజినీకాంత్, ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

Bholaa Shankar: మెగాస్టార్ మూవీ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందేనా..?

లాల్ సలామ్ మూవీలో రజినీ సోదరి పాత్రలో జీవితా రాజశేఖర్ నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా కథ కూడా సిస్టర్ సెంటిమెంట్‌తో ఆడియెన్స్ చేత కన్నీళ్లు పెట్టించేలా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. మరి ఇలా సీనియర్ హీరోలందరూ సిస్టర్ సెంటిమెంట్‌తో సినిమాలు చేస్తుండటంతో అభిమానులు వారి నుండి ఇతర జోనర్ మూవీలు రావాలని కోరుతున్నారు.