Atharva : రజినీకాంత్ చేతుల మీదుగా ధోని ‘అధర్వ’ రిలీజ్

తాజాగా ఈ 'అధర్వ' గ్రాఫిక్​ నవలని విడుదల చేశారు. సూపర్​స్టార్​ రజనీ కాంత్​ చెన్నైలోని తన నివాసంలో లాంఛనంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలికాపీని రజనీ కాంత్​ విడుదల చేయడంపై ధోని...

Atharva : రజినీకాంత్ చేతుల మీదుగా ధోని ‘అధర్వ’ రిలీజ్

Dhoni

 

Dhoni :  భారత క్రికెట్ మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచం అంతటా చాలా మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. మహి ఇండియన్ క్రికెట్ కి దూరమైనా ఐపీఎల్ ద్వారా అభిమానులని అలరిస్తున్నాడు. ఇక ధోని క్రికెట్ తో పాటు వేరే గేమ్స్, సాహస కార్యక్రమాలు, బైక్ రైడింగ్స్, యాడ్స్ … లాంటి రకరకాల పనులు చేస్తూ అభిమానులకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు.

ఇటీవల ధోని మరో కొత్త అవతారంలో కనిపించదు. మహేంద్ర సింగ్ ధోని తమిళ సంగీత దర్శకుడు రమేష్ తమిళ్‌మణి రచిస్తున్న గ్రాఫిక్ నవల ‘అధర్వ: ది ఆరిజిన్’లో హీరో పాత్రలో కనిపించనున్నాడు. ఇది ఒక గ్రాఫిక్ నవల. ఇటీవల దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. గతంలోనే ధోని ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ.. ”ఈ ప్రాజెక్ట్‌తో కలిసినందుకు నేను చాలా థ్రిల్‌ అవుతున్నాను. ఇది నిజంగా అద్భుతమైన వెంచర్. ‘అథర్వ – ది ఆరిజిన్’ అనేది ఆకర్షణీయమైన కథ, ఆకర్షణీయమైన గ్రాఫిక్ నవల” అని తెలిపారు.

Atharva

Bollywood : ప్రముఖ నటుడు మహేశ్‌ మంజ్రేకర్‌పై కేసు నమోదు

తాజాగా ఈ ‘అధర్వ’ గ్రాఫిక్​ నవలని విడుదల చేశారు. సూపర్​స్టార్​ రజనీ కాంత్​ చెన్నైలోని తన నివాసంలో లాంఛనంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలికాపీని రజనీ కాంత్​ విడుదల చేయడంపై ధోని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే బుక్ పబ్లిషర్​, రచయిత రమేశ్​ తమిళమణి​ మాట్లాడుతూ.. ”రజినీకాంత్ గారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయటం ఆనందంగా ఉంది. మా కష్టాన్ని ఆయన గురించడంతో మాలో మరింత ఉత్సాహం పెరిగింది. ఈ పుస్తకం ప్రస్తుతం అమెజాన్​లో 1499 రూపాయలకు అందుబాటులో ఉంది. కావాల్సిన వారు ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు” అని తెలిపారు. ధోని అభిమానులు, కామిక్స్, నవలలని ఇష్టపడేవాళ్లు ఈ పుస్తకాన్నికొనుగోలు చేస్తున్నారు.