Rajinikanth : మెగాస్టార్ డైరెక్టర్‌తో సూపర్ స్టార్ సినిమా.. నిజమేనా?

చిరంజీవి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న బాబీ.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఒక సినిమా చేయబోతున్నాడట. ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

Rajinikanth : మెగాస్టార్ డైరెక్టర్‌తో సూపర్ స్టార్ సినిమా.. నిజమేనా?

Rajinikanth movie with chiranjeevi director Bobby under dil raju production

Rajinikanth : పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అవ్వడంతో క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలు మరొక ఇండస్ట్రీలోని హీరోలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. తాజాగా అటువంటి క్రేజీ కాంబినేషన్ ఒకటి సౌత్ లో సెట్ అవుతున్నట్లు సమాచారం. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న బాబీ.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో (Rajinikanth) ఒక సినిమా చేయబోతున్నాడట. ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఇటీవలే 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న దిల్ రాజు.. ట్విట్టర్ లో నెటిజెన్లతో చిట్ చాట్ నిర్వహించాడు.

Jailer Movie: రాజస్థాన్‌లో ఛేజింగ్ చేస్తోన్న జైలర్.. ఫోటోలు లీక్!

ఆ చిట్ చాట్ లో దిల్ రాజు ఒక నెటిజెన్ ప్రశ్నకు బదులిస్తూ.. త్వరలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఒక సినిమా చేయబోతున్నా అంటూ తెలియజేశాడు. తాజాగా ఆ ప్రాజెక్ట్ కి అంతా రంగం సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇటీవలే వరిసు సినిమాతో టాలీవుడ్ డెబ్యూట్ ఇచ్చిన దిల్ రాజు.. బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో కోలీవుడ్ లో ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇక దర్శకుడు బాబీ విషయానికి వస్తే.. వాల్తేరు వీరయ్య సినిమాతో వింటేజ్ చిరుని అభిమానులకు పరిచయం చేశాడు. ఇప్పుడు రజినిని కూడా వింటేజ్ లుక్ లో చూపిస్తాడా అనేది చూడాలి.

Jailer Movie: ‘జైలర్’తో రొమాన్స్ కు మిల్కీ బ్యూటీ సై!

ప్రస్తుతం రజినీకాంత్ చేతిలో జైలర్, లాల్ సలాం, జై భీమ్ దర్శకుడితో ఒక సినిమా ఉన్నాయి. జైలర్ అండ్ లాల్ సలాం చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. త్వరలోనే జై భీమ్ దర్శకుడి సినిమా కూడా పట్టాలు ఎక్కించనున్నాడు. మరి ఈ సినిమాతో పాటే బాబీ చిత్రాన్ని కూడా మొదలు పెడతాడా? లేదా ఈ మూవీ కంప్లీట్ అయిన తరువాతే స్టార్ చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.