Rajinikanth: మొయ్దీన్ భాయ్‌గా సరికొత్త లుక్‌లో ఎంట్రీ ఇచ్చిన రజినీకాంత్
ఐశ్వర్యా రజినీకాంత్ తెరకెక్కిస్తున్న ‘లాల్ సలామ్’ మూవీలో మొయ్దీన్ భాయ్ అనే పాత్రలో రజినీకాంత్ సరికొత్త అవతారంలో కనిపించి అందరినీ స్టన్ చేశారు.

Rajinikanth Never Before Look As Moideen Bhai In Lal Salaam Movie
Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’ నుండి ఇటీవల ఓ సాలిడ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో, ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్యా రజినీకాంత్ తెరకెక్కిస్తున్న ‘లాల్ సలామ్’ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Rajinikanth : రజినీ ముచ్చట్లపై రచ్చ రచ్చ
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ‘లాల్ సలామ్’ పీరియాడిక్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. అయితే, ఈ సినిమాలో మొయ్దీన్ భాయ్ అనే పాత్రలో రజినీకాంత్ నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఈ మూవీలోని ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రజినీకాంత్‌ను మునుపెన్నడూ చూడని విధంగా చూసి అభిమానులు అవాక్కవుతున్నారు.
Rajinikanth: ఎన్టీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం చాలా ప్రత్యేకం – రజినీకాంత్
రజినీకాంత్‌ను ఇలా సరికొత్త అవతారంలో చూసి అభిమానులు ఈ పోస్టర్‌ను నెట్టింట తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న లాల్ సలామ్ మూవీని ఈ ఏడాది చివరికల్లా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Everyone’s favourite BHAI is back in Mumbai 📍 Make way for #Thalaivar 😎 SuperStar 🌟 #Rajinikanth as #MoideenBhai in #LalSalaam 🫡
இன்று முதல் #மொய்தீன்பாய் ஆட்டம் ஆரம்பம்…! 💥
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
🌟 @rajinikanth @TheVishnuVishal & @vikranth_offl
🎥… pic.twitter.com/OE3iP4rezK— Lyca Productions (@LycaProductions) May 7, 2023