Rajinikanth: పదేళ్ల తరువాత ఆ ఫీట్ చేస్తోన్న రజినీకాంత్!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ డైరెక్షన్‌లో ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటోంది. అయితే, జైలర్ సినిమా రిలీజ్ కాకముందే రజినీకాంత్ మరో సినిమాలో కనిపించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Rajinikanth: పదేళ్ల తరువాత ఆ ఫీట్ చేస్తోన్న రజినీకాంత్!

Rajinikanth To Do A Cameo After 10 Years

Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ డైరెక్షన్‌లో ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని తమిళ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Rajinikanth: ఒక్క సినిమా సక్సెస్‌తోనే సూపర్ స్టార్‌కు కథ వినిపించిన డైరెక్టర్!

అయితే, జైలర్ సినిమా రిలీజ్ కాకముందే రజినీకాంత్ మరో సినిమాలో కనిపించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓ యంగ్ హీరో నటిస్తున్న సినిమాలో కేమియో పాత్రలో రజినీకాంత్ మెరవనున్నాడట. రజినీ కేమియో పాత్రలు చాలా అరదుగా చేస్తుంటాడు. గతంలో 2011లో వచ్చిన షారుక్ ఖాన్ ‘రా-వన్’ సినిమాలో కేమియో రోల్‌లో కనిపించాడు రజినీకాంత్. ఆ సినిమా తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఆయన కేమియో రోల్ చేస్తుండటం విశేషమని చెప్పాలి.

Rajinikanth : నేను చిన్న క్యారెక్టర్ అడిగినా మణిరత్నం ఇవ్వలేదు.. నేను, కమల్‌, శ్రీదేవి, విజయ్‌ కాంత్‌లతో ఈ సినిమా తీద్దాం అనుకున్నాం..

దాదాపు పదేళ్ల తరువాత రజినీకాంత్ వేరొక హీరో సినిమాలో కేమియో పాత్ర చేస్తుండటంతో అందరి చూపులు ఆ సినిమాపై పడ్డాయి. అయితే, ఆ సినిమాను రజినీ కూతురు ఐశ్వర్యా రజినీకాంత్ తెరకెక్కిస్తుండగా, యంగ్ హీరో అథర్వ మురళీ హీరోగా నటిస్తున్నాడు. మరి ఈ సినిమాలో రజినీకాంత్ ఎలాంటి కేమియో పాత్రలో నటిస్తాడా అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.