సుమ ఇంట విషాదం.. రాజీవ్ కనకాల చెల్లెలు హఠాన్మరణం..

ప్రముఖ నటులు, దర్శకులు దేవదాస్ కనకాల కుమార్తె, రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మీ అనారోగ్యంతో మృతిచెందారు..

10TV Telugu News

ప్రముఖ నటులు, దర్శకులు దేవదాస్ కనకాల కుమార్తె, రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మీ అనారోగ్యంతో మృతిచెందారు..

ప్రముఖ నటులు, దర్శకులు, ఎందరో నటనలో ఓనమాలు నేర్పించిన గురువు దేవదాసు కనకాల గారి ఏకైక కుమార్తె, రాజీవ్ కనకాల చెల్లెలు శ్రీలక్ష్మీ హఠాన్మరణం చెందారు. గతకొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న శ్రీలక్ష్మీ సోమవారం(ఏప్రిల్6) తుదిశ్వాస విడిచారు.

Rajiv Kanakala's Sister Srilakshmi Kanakala Passes away

ఆమె భర్త రామారావు పెద్ది సీనియర్ జర్నలిస్ట్. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. కొద్దిరోజుల క్రితం దేవదాస్ కనకాల శ్రీమతి లక్ష్మీ, అనంతరం దేవదాస్ కనకాల, ఇప్పుడు శ్రీలక్ష్మీ మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Rajiv Kanakala's Sister Srilakshmi Kanakala Passes away

అడపాదడపా పలు సీరియల్స్‌లో నటించిన శ్రీలక్ష్మీ నటిగా రాణించలేకపోయారు. ఆమె మరణంతో రాజీవ్ కనకాల విషాదంలో మునిగిపోయారు. శ్మీలక్ష్మీ మరణవార్త తెలియగానే పలువురు సినీ, టీవీ రంగాలకు చెందినవారు సంతాపం తెలియచేస్తున్నారు.

Rajiv Kanakala's Sister Srilakshmi Kanakala Passes away

Read Also : నిర్మాత కూతురికి కరోనా..