HIT The First Case: హిందీ హిట్.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘హిట్ ది ఫస్ట్ కేస్’ మూవీ ఆడియెన్స్‌ను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. బాలీవుడ్‌లోనూ ‘హిట్ ది ఫస్ట్ కేస్’ సినిమాను తెరకెక్కించారు అక్కడి దర్శకనిర్మాతలు. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

HIT The First Case: హిందీ హిట్.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!

Rajkummar Rao HIT The First Case Locks Its OTT

HIT The First Case: టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘హిట్ ది ఫస్ట్ కేస్’ మూవీ ఆడియెన్స్‌ను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా, హీరోగా విశ్వక్ సేన్‌కు అదిరిపోయే హిట్‌ను అందించింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది.

‘హిట్’ రీమేక్‌లో రాజ్‌కుమార్ రావు..

అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా హిట్-2 కూడా రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లోనూ ‘హిట్ ది ఫస్ట్ కేస్’ సినిమాను తెరకెక్కించారు అక్కడి దర్శకనిర్మాతలు. ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ రీమేక్ సినిమాను కో-ప్రొడ్యూస్ చేయగా, దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశారు. బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు హీరోగా తెరకెక్కిన ‘హిట్ ది ఫస్ట్ కేస్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

Adivi Sesh: ‘హిట్-2’పై అడివి శేష్ సాలిడ్ అప్‌డేట్

అయితే ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో హిట్ ది ఫస్ట్ కేస్ మూవీని ఆగస్టు 28 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు చిత్ర యనిట్ ప్రకటించింది. ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో ఎంజాయ్ చేయొచ్చని చిత్ర యూనిట్ పేర్కొంది. మరి ఓటీటీలో వస్తున్న హిట్ ది ఫస్ట్ కేస్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.