RRR: “ఆర్ఆర్ఆర్” ఆస్కార్ ప్రచారాల కోసం.. PR ఏజెన్సీని రంగంలోకి దించిన రాజమౌళి!

టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన "RRR".. భారతీయ సినీ ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ అభిమానుల నుంచి కూడా అభినందనలు అందుకుంటుంది. ఇక ఈ చిత్రానికి బదులుగా భారత్ ప్రభుత్వం.. గుజరాతీ సినిమాను ఆస్కార్స్ కు ఎంపిక చేయడంతో, ఆర్ఆర్ఆర్ టీం రంగంలోకి దిగి ఇండిపెండెంట్ గా నామినేషన్ చేసుకుంది. దీంతో రాజమౌళి...

RRR: “ఆర్ఆర్ఆర్” ఆస్కార్ ప్రచారాల కోసం.. PR ఏజెన్సీని రంగంలోకి దించిన రాజమౌళి!

Rajmouli Hiring PR Team For RRR Oscar Promotions

RRR: టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన “RRR”.. భారతీయ సినీ ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ అభిమానుల నుంచి కూడా అభినందనలు అందుకుంటుంది. ఇక ఈ చిత్రానికి బదులుగా భారత్ ప్రభుత్వం.. గుజరాతీ సినిమాను ఆస్కార్స్ కు ఎంపిక చేయడంతో, ఆర్ఆర్ఆర్ టీం రంగంలోకి దిగి ఇండిపెండెంట్ గా నామినేషన్ చేసుకుంది.

RRR For Oscars: ఆ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ది సాహసమే అని చెప్పాలి!

దీంతో రాజమౌళి కొన్ని వారాల క్రితం నుంచి RRR ఆస్కార్ ప్రమోషన్‌లను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోనే యూస్ లో జరిగిన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కొంతమంది విదేశీ జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా ఒక PR ఏజెన్సీని కూడా నియమించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

RRR ఆస్కార్ ప్రచారం కోసం దాదాపు 10 మిలియన్ల డాలర్ లు PR టీంకి ముట్టజెప్పినట్లు తెలుస్తుంది. ఈ మొత్తం ఖర్చుని రాజమౌళి స్వయంగా భరిస్తున్నట్లు సమాచారం. కారణం రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తన మార్కెట్ ని ఏర్పరుచుకోవడానికి అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే, తన తదుపరి సినిమా అంతర్జాతీయ స్థాయి విలువలతో ఉండబోతున్నట్లు జక్కన్న తెలిపిన విషయం తెలిసిందే.