KGF2: ఆగని వసూళ్ల ప్రభంజనం.. రూ.వెయ్యి కోట్ల క్లబ్‌లోకి రాఖీభాయ్!

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఇండియన్ సినిమా చరిత్రలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా 2 వారాల రన్ పూర్తి చేసుకుని మూడో వారంలో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది.

KGF2: ఆగని వసూళ్ల ప్రభంజనం.. రూ.వెయ్యి కోట్ల క్లబ్‌లోకి రాఖీభాయ్!

KGF2

KGF2: యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఇండియన్ సినిమా చరిత్రలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా 2 వారాల రన్ పూర్తి చేసుకుని మూడో వారంలో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. ఓపెనింగ్ నుంచే వరుసగా బాక్సీఫీస్ వద్ద ఒక్కో రికార్డును బ్రేక్ చేస్తూ వచ్చిన కేజీఎఫ్ 2 తాజాగా రూ.వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన తొలి కన్నడ చిత్రంగా నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు సంపాదించిన నాల్గొ భారతీయ కన్నడ చిత్రంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

KGF2: బాలీవుడ్‌లో కేజీయఫ్2 తుఫాన్.. ఇప్పట్లో ఆగేలా లేదుగా!

తొలి రోజు నుండే ఇండియా వ్యాప్తంగా భారీ వసూళ్లతో నడుస్తున్న కేజీఎఫ్ 2.. ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల గ్రాస్ వసూళ్ళని అందుకున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో ఈ ఏడాదిలో రెండో 1000 కోట్ల సినిమాగా నిలిచిన ఈ సినిమా..మన ఇండియన్ సినీ చరిత్రలో బాహుబలి 2, దంగల్, ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పుడు చేరిన ఏకైక కన్నడ సినిమాగా నిలిచింది. అలాగే నాల్గవ ఇండియన్ సినిమాగా కేజీయఫ్ 2 సెన్సేషన్ ని నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

RRR-KGF2: కలెక్షన్ల సునామి.. దెబ్బకు బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు!

సౌత్ ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ట్విట్టర్‌లో పంచుకున్న విషయాల ప్రకారం.. కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.1,000 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిందని తెలిపారు. మరోవైపు ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ చిత్రం కేవలం 15 రోజుల్లోనే సెన్సేషన్ క్రియేట్ చేయగా 16వ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ ఇలా ఉంది. హిందీ బెల్ట్ 432 కోట్లు, కర్ణాటక 163 కోట్లు, ఏపీ/తెలంగాణ 141 కోట్లు, తమిళనాడు 89 కోట్లు, కేరళ 60 కోట్లు, ఓవర్సీస్ 177 కోట్లు రాబట్టి మొత్తంగా రూ.1,062 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.