మెడికల్ స్టోర్స్‌‌లో మందు?అరే, నాకు తెలియదే!

మెడికల్ స్టోర్స్‌‌లో మందు?అరే, నాకు తెలియదే!

మద్యం కొనుగోలు చేసిందంటూ తనపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్..

మెడికల్ స్టోర్స్‌‌లో మందు?అరే, నాకు తెలియదే!

మద్యం కొనుగోలు చేసిందంటూ తనపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్..

రకుల్ ప్రీత్ సింగ్ లిక్కర్ షాపు నుండి మందు కొనుక్కెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఇన్ని రోజులూ మందు బంద్ అయింది. ఇటీవలే గ్రీన్ జోన్లలో వైన్ షాపులు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వరద బాధితుడికి పులిహోర పొట్లం దొరికినంత సంబరపడిపోయారు మందుబాబులు. ఆడా, మగా అందరూ మందు కోసం క్యూ కట్టారు.

ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ కూడా మందు కొనేసిందోచ్ అంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది. తాజాగా ఈ వీడియోపై రకుల్ స్పందించిది. ‘‘వావ్.. మెడికల్ షాపులలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనే విషయం నాకు తెలియదు..’’ అంటూ వింతైన ఎమోజీలతో ఓ ట్వీట్ వేసింది. ఆమె ట్వీట్ ఇప్పటి వరకు తనపై ట్రోల్ చేసిన వారికి సాలిడ్ కౌంటర్ ఇచ్చినట్టు ఉందంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

×