కాజల్, తమన్నాని ఫాలో అవుతోన్న రకుల్ ప్రీత్

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 06:06 AM IST
కాజల్, తమన్నాని ఫాలో అవుతోన్న రకుల్ ప్రీత్

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ హీరోయిన్ తలరాత.. ఎలా మారుతుందో అస్సలు తెలియదు. స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన వాళ్లు కూడా ఒక్క అవకాశం దొరికితే చాలు అనుకునే స్థాయిని పడిపోతారు. సేమ్ టూ సేమ్ ఇప్పుడు హీరోయిన్.. రకుల్ ప్రీత్ సింగ్ సిచ్చుయేషన్ ఇలాగే తయారైంది. ప్రస్తుతం రకుల్ కుడా కాజల్, తమన్నా బాటలోనే ప్రయాణిస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్ గత కొంతకాలంగా మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా స్టార్ హీరోలందరితోనూ వరుసపెట్టి సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ గా ఆడియన్స్ లో క్రేజ్ ని సంపాదించుకుంది. అలాంటి రకుల్ కి ఇప్పుడు తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. స్టార్ హీరోల మాట దేవుడెరుగు చివరికి చిన్న హీరోలు, సీనియర్ హీరోలతో సైతం నటించేందుకు అమ్మడు సై అంటోంది.

2017లో వచ్చిన స్పైడర్ సినిమా తర్వాత రకుల్ మరో తెలుగు సినిమాలో నటించలేదు. మధ్యలో అడపాదడపా పేరు వినిపించినా అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. ప్రస్తుతం రకుల్, మన్మధుడు 2 సినిమాలో సీనియర్ హీరో నాగార్జున సరసన నటిస్తోంది. లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న తుగ్లక్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న రాక్షసన్ రీమేక్ లో నటించే అవకాశం వచ్చినా మరో హీరోయిన్ అనుపమ, రకుల్ ని పక్కకు నెట్టేసింది.

హీరోయిన్స్ కాజల్, తమన్నా కూడా మొదట్లో పెద్ద హీరోలతో సినిమాలు చేసి ఓ రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నారు. కానీ.. ఆ తర్వాత స్టార్ హీరోలంతా పక్కన పెట్టేయడంతో ఇప్పుడు యంగ్ హీరో, సీనియర్ హీరో అనే తేడా లేకుండ వచ్చిన ప్రతి సినిమా చేస్తూ వెళ్తున్నారు. పెద్ద హీరోలతో సినిమాలు లేకపోయినా చేతినిండా పనితో బిజీగా గడిపేస్తున్నారు. అందుకే మొన్నటిదాకా స్టార్ హీరోలతోనే నటిస్తానని బెట్టుచేసిన రకుల్ కూడా ఇప్పుడు కాజల్, తమన్నానే ఫాలో అయిపోతుంది.