IKSHU Movie: రామ్ అగ్నివేశ్ హీరోగా “ఇక్షు” సినిమా.. ఫస్ట్ లుక్!

పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రామ్ అగ్నివేశ్ హీరోగా ఋషిక దర్సకత్వంలో హనుమంతురావు నాయుడు, డాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో వస్తున్న సినిమా "ఇక్షు".

IKSHU Movie: రామ్ అగ్నివేశ్ హీరోగా “ఇక్షు” సినిమా.. ఫస్ట్ లుక్!

Ikshu Movie

IKSHU Movie: పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రామ్ అగ్నివేశ్ హీరోగా ఋషిక దర్సకత్వంలో హనుమంతురావు నాయుడు, డాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో వస్తున్న “ఇక్షు” సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటించారు.

ఈ సంధర్భంగా డైరెక్టర్ ఋషిక మాట్లాడుతూ.. “మా హీరో రామ్ అగ్నివేశ్ మొదటి సినిమా అయినా కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న హీరోలా నటించాడు. ఈ రోజు తన జన్మదినం సందర్బంగా మా ఇక్షు సినిమా ఏ.వీ రిలీజ్ చేశామని, మా ఇక్షు సినిమా ఏ.వీ మీ అందరకి నచ్చుతుంది అని అనుకుంటున్నాను, త్వరలో మా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక్షు మూవీతో స్టార్ట్ అయిన మా హీరో జర్నీ ఫ్యూచర్‌లో దిగ్విజయంగా సాగాలని కోరుకుంటున్నాను.” అని అన్నారు.

ప్రొడ్యూసర్ హనుమంతురావు నాయుడు మాట్లాడుతూ.. “మా హీరోరామ్ అగ్నివేశ్  జన్మదినం సందర్బంగా మా హీరో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను, మా హీరో సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పారు. లొకేషన్‌లో కూడా సింగల్ టేక్ ఆర్టిస్ట్‌గా మా ఇక్షు టీం నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పటికే మేం రిలీజ్ చేసిన టీజర్‌కి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన లభించింది. త్వరలో సినిమా ట్రైలర్ లాంచ్ చేయబోతున్నాము. మా సినిమాని ఆదరిస్తారు అని నమ్ముతున్నాము” అని అన్నారు.