Ram Charan : హాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్‌ని.. ఇండియా రావాలని కండిషన్ పెడతా.. రామ్‌చరణ్!

G20 సమ్మిట్ లో పాల్గొన్న రామ్ చరణ్.. హాలీవుడ్ ప్రాజెక్ట్స్ అండ్ చిరంజీవి ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Ram Charan : హాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్‌ని.. ఇండియా రావాలని కండిషన్ పెడతా.. రామ్‌చరణ్!

Ram Charan about his hollywood projects and chiranjeevi projects at G20 Summit

Ram Charan at G20 Summit : టాలీవుడ్ హీరో రామ్ చరణ్ నేడు తాజాగా కశ్మీర్ శ్రీనగర్ (Srinagar) లో జరుగుతున్న G20 సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమ్మిట్ లో ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ పై చర్చెందుకు 17 దేశాల నుంచి పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. ఇక ఇండియా నుంచి మన మెగా పవర్ స్టార్ హాజరయ్యాడు. జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) కు రాష్ట్ర హోదాను తొలగించిన తర్వాత అక్కడ టూరిజం డెవలప్ చేసేందుకు సినిమా షూటింగ్స్ కూడా జరగాలనే అంశం పై ఎక్కువ చర్చ జరిగింది.

Ram Charan : ప్రజలు మమ్మల్ని చూడడానికి రాలేదు.. రామ్‌చరణ్ కోసం వచ్చారు.. సెంట్రల్ మినిస్టర్ కామెంట్స్!

ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ మాట్లాడుతూ.. “ఇండియాలోని అందమైన షూటింగ్ లొకేషన్స్ ని నేను ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను నటించబోయే సినిమా షూటింగ్స్ కోసం నేను ఇతర దేశాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంటున్నాను. ఒక వేళా నాతో హాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు సినిమా తియ్యాలి అని అనుకున్నా.. వారిని ఇండియా రావాలని కండిషన్ పెడతా” అంటా చెప్పుకొచ్చాడు.

కాగా RRR తో రామ్ చరణ్ గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే. దీంతో హాలీవుడ్ మేకర్స్ కూడా చరణ్ తో సినిమా తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు హాలీవుడ్ మేకర్స్ తో కూడా చర్చలు జరిగాయని, త్వరలోనే హాలీవుడ్ సినిమా ఉండబోతుందని రామ్ చరణ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

Ram Charan : 2016లో ఇదే ఆడిటోరియంలో సినిమా షూట్ చేశాం.. ఇప్పుడు సమ్మిట్‌లో పాల్గొన్నా.. రామ్‍చరణ్!

ఇక ఇదే ఇంటర్వ్యూలో రామ్ చరణ్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. “మా నాన్న గారికి 68 వయసు. అయినా ఆయన నాలుగు సినిమాలు చేస్తూ ఇంకా బిజీగా ఉన్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషకం తీసుకునే యాక్టర్స్ లో ఆయన ఒకరు. ఇక ఇంతటి ఫేమ్ సంపాదించుకున్నా.. ఇప్పటికి ఇంకా ఉదయం 5:30 గంటలకు నిద్ర లేచి వర్క్ అవుట్స్ చేస్తూనే ఉంటారు. 68 ఏళ్ళ వయసులో కూడా ఆయన సినిమా పై, చేసే పని పై చూపించే డెడికేషన్ చూసి మాకు ఎంతో స్ఫూర్తిని కలగజేస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు.