సీతా రామరాజుల లుక్స్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్

#RRR - రామ్ చరణ్, అలియా భట్‌ల లీకేజ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

  • Published By: sekhar ,Published On : February 18, 2020 / 04:57 AM IST
సీతా రామరాజుల లుక్స్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్

#RRR – రామ్ చరణ్, అలియా భట్‌ల లీకేజ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

‘బాహుబలి : ది బిగినింగ్’, ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’ సినిమాలతో యావత్ ప్రపంచం చూపు తెలుగు సినిమా వైపు తిప్పాడు దర్శకధీరుడు రాజమౌళి. తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవల్‌కి తీసుకెళ్లి, మన సినిమా స్థాయిని పెంచడమే కాక తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని, గౌరవాన్ని తీసుకొచ్చాడు.

రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘#RRR’.. స్వాతంత్ర్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరంభీమ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న సంగతి తెలిసిందే.

జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ‘#RRR’ కీ లీకుల బాధ తప్పడం లేదు. తాజాగా రామ్ చరణ్, అలియా భట్‌ల పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు సీత పాత్ర‌లో ఆలియా భ‌ట్ న‌టిస్తుంది. కాగా.. ‘ఆర్ఆర్ఆర్‌’లో చ‌ర‌ణ్‌, ఆలియా లుక్స్ ఇవేనంటూ సోష‌ల్ మీడియాలో రెండు ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

బ్రిటీష్ సైనికాధికారి పాత్ర‌లో చ‌ర‌ణ్‌, పాత‌కాలం చీర‌క‌ట్టులో ఆలియాభ‌ట్ క‌న‌ప‌డుతున్నారు. ఇవి నిజంగా సినిమాలో ఫోటోలా.. లేక ఫ్యాన్ మేడా అనేది తెలియాలంటే మూవీ యూనిట్ ఈ లీకేజ్డ్ పిక్స్ గురించి క్లారిటీ ఇవ్వాల్సిందే. అజయ్ దేవ్‌గన్ కీలక పాత్రలో నటిస్తున్న ‘RRR’ 2021 జనవరి 8న పదిభాషల్లో విడుదల కానుంది.

RRR RAM CHARAN

Read More>> ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ కన్నుమూత