RC15 : రామ్ చరణ్ – శంకర్ మూవీ టైటిల్ అదేనా.. ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న టైటిల్!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR వంటి సక్సెస్ తరువాత చేస్తున్న మూవీ 'RC15'. ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజున టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉంటుంది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్..

RC15 : రామ్ చరణ్ – శంకర్ మూవీ టైటిల్ అదేనా.. ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న టైటిల్!

rc15 title as ceo

RC15 : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR వంటి సక్సెస్ తరువాత చేస్తున్న మూవీ ‘RC15’. ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడైన శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళ స్టార్ డైరెక్ట్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకి కథని అందిస్తున్నాడు. వీరందరి కలయికతో ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. 2021లో ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ ఇవ్వడం తప్ప ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో చరణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా.. టైటిల్ గాని ఫస్ట్ లుక్ పోస్టర్ గాని రిలీజ్ చేయండి అంటూ దర్శకనిర్మాతలను కోరుతున్నారు.

Ram Charan : నేను ఆస్కార్ కోసం వెళ్లడం లేదు.. వాళ్ళ కోసమే వెళ్తున్నాను.. రామ్‌చరణ్!

ఇక ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజున టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉంటుంది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఒక టైటిల్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. RC15 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ‘CEO’ అనే టైటిల్ ని ఖరారు చేశారట. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

కాగా CEO అంటే ‘చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్’ అని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్.. తండ్రి, కొడుకులుగా రెండో పాత్రల్లో కనిపించబోతున్నాడు. తండ్రి పాత్ర రాజకీయ నాయుడు నేపథ్యంతో ఉండబోతుంది. కొడుకు పాత్ర IAS ఆఫీసర్ నేపథ్యంతో ఉండనుంది అంటూ గతంలో వార్తలు వినిపించాయి. ఇప్పుడు CEO టైటిల్ నిజమైతే.. చరణ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడా? అనే సందేహం మొదలైంది. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, ఈ నెలాఖరులో ఈ మూవీ కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుంది. ఆ షెడ్యూల్లో ప్రభుదేవా కోరియోగ్రఫీలో ఒక సాంగ్ చిత్రీకరించబోతున్నారని సమాచారం.