Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా...

Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?

Ram Charan Asks For Changes In Gautam Tinnanuri Script

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో మరో హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా తరువాత కూడా తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెట్టేందుకు చరణ్ ట్రై చేస్తున్నాడు.

Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?

ఈ క్రమంలోనే గతంలో ‘జెర్సీ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నుండి ఓ సబ్జెక్ట్‌ను విన్నాడు చరణ్. అయితే ఆ కథపై తన నిర్ణయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో మరోసారి చరణ్‌ను కలిశాడట ఈ యంగ్ డైరెక్టర్. అయితే గౌతమ్ చెప్పిన కథలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా చెర్రీ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం గౌతమ్ చరణ్ కోసం తయారు చేసిన కథలో పలు కీలక మార్పులు చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?

ఇప్పటికే చరణ్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తూ వస్తున్న గౌతమ్, ఇప్పుడు చరణ్ సూచనతో మరింత కాలం వెయిట్ చేయక తప్పడం లేదు. అయినా కూడా చరణ్‌తోనే సినిమా చేసేందుకు ఈ డైరెక్టర్ కంకణం కట్టుకున్నట్లుగా ఇంతకాలం వెయిట్ చేసేందుకు కూడా రెడీ అయ్యాడు. మరి చరణ్ కోసం గౌతమ్ తిన్ననూరి ఎలాంటి కథను పట్టుకొస్తాడో చూడాలి అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఏదేమైనా ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా హాట్ టాపిక్‌గా మారింది.