Ram Charan : ఆస్కార్ తరువాత రామ్‌చరణ్ బర్త్ డే.. గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న అభిమానులు..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR చిత్రం గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సమయంలో చరణ్ అభిమానులను మరింత ఉత్సాహ పరిచేలా రామ్ చరణ్ బర్త్ డే వస్తుంది. ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే ఉంది. ఆస్కార్ తరువాత ఈ బర్త్ డే వస్తుండడంతో అభిమానులు గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.

Ram Charan : ఆస్కార్ తరువాత రామ్‌చరణ్ బర్త్ డే.. గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న అభిమానులు..

Ram Charan fans are celebrating their hero birthday in Grandeur at hyderabad Shilpakalavedhika

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR చిత్రం గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సినిమాతో ఎక్కడైతే ట్రోలింగ్ కి గురయ్యాడో, అక్కడే జై కొట్టించుకుంటున్నాడు. కేవలం ఇండియాలోనే కాదు RRR లో తన యాక్టింగ్‌కి, లుక్స్‌కి హాలీవుడ్ అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. హాలీవుడ్ మీడియా సైతం ఇండియన్ బ్రాడ్ పిట్, హెన్రీ కెవిల్, జేమ్స్ బాండ్ అంటూ ఆర్టికల్స్ రాసుకొస్తున్నారు. రామ్ చరణ్ త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నట్లు అని తెలుస్తుంది. ఈ సమయంలో చరణ్ అభిమానులను మరింత ఉత్సాహ పరిచేలా రామ్ చరణ్ బర్త్ డే వస్తుంది.

Ram Charan : ఆస్కార్ తర్వాత మొదటిసారి మీడియా ముందుకు రామ్ చరణ్.. ఇండియా స్పీకర్ షిప్ సమ్మిట్ ప్రోగ్రాంలో ఏం మాట్లాడాడో తెలుసా??

ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే ఉంది. ఆస్కార్ తరువాత ఈ బర్త్ డే వస్తుండడంతో అభిమానులు గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బర్త్ డే CDP ని అదిరేలా డిజైన్ చేసి నిన్న రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింటే వైరల్ అవుతుంది. అలాగే ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా భారీ రక్తదాన కారిక్రమం నిర్వహించనున్నారు. ఇక 26 సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి గ్రాండ్ పార్టీ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం 4:32 గంటల నుంచి ప్రారంభం కానుంది. మరి ఈ వేడుకకు మెగా హీరోలు ఎవరన్నా రాబోతున్నారా? లేదా? అన్నది ఇంకా తెలియలేదు.

Ram Charan : నాటు నాటు తెలుగు పాట కాదు ఇండియన్ సాంగ్.. ఢిల్లీలో రామ్‌చరణ్!

ఇది ఇలా ఉంటే చరణ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న RC15 అప్డేట్ కూడా ఆ రోజు రాబోతుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా వస్తుంది. ఈ మూవీలో చరణ్ తండ్రి, కొడుకుల పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి CEO (చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్) అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. బర్త్ డే రోజు టైటిల్ తో పాటు ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. RRR వంటి గ్లోబల్ హిట్ తరువాత ఈ సినిమా వస్తుండడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.