Ram Charan: 9 ఏళ్ళ తర్వాత బాలీవుడ్ లోకి చెర్రీ.. ఇంత గ్యాప్ ఎందుకంటే?

ఈమధ్య టాలీవుడ్ హీరోలందరూ పాన్ ఇండియా పాన్ ఇండియా అని బాలీవుడ్ ఎంట్రీ కోసం తెగ హడావిడి చేస్తున్నారు. అయితే టాలీవుడ్ థర్డ్ జనరేషన్ స్టార్ అయిన రామ్ చరణ్ తూఫాన్ తో ఎప్పుడో బాలీవుడ్..

Ram Charan: 9 ఏళ్ళ తర్వాత బాలీవుడ్ లోకి చెర్రీ.. ఇంత గ్యాప్ ఎందుకంటే?

Ram Charan

Ram Charan: ఈమధ్య టాలీవుడ్ హీరోలందరూ పాన్ ఇండియా పాన్ ఇండియా అని బాలీవుడ్ ఎంట్రీ కోసం తెగ హడావిడి చేస్తున్నారు. అయితే టాలీవుడ్ థర్డ్ జనరేషన్ స్టార్ అయిన రామ్ చరణ్ తూఫాన్ తో ఎప్పుడో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ మూవీగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ మళ్లీ బాలీవుడ్ లో సినిమా రిలీజ్ చెయ్యడానికి 9ఏళ్లు టైమ్ తీసుకున్నారు.

Anupama Parameswaran: డబ్బిస్తే ఏదైనా చేస్తావా.. అనుపమకి నెటిజన్ల ట్రోలింగ్!

పాన్ ఇండియా మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రభాస్ అని అందరూ ఈమధ్య తెగ పొగిడేస్తున్నారు కానీ.. అసలు టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ కి ఎప్పుడో 8 ఏళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చారు. ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా అమితాబ్ బచ్చన్ జంజీర్ మూవీకి రీమేక్ గా వచ్చిన తూఫాన్ సినిమా తర్వాత రామ్ చరణ్ మళ్లీ బాలీవుడ్ లో సినిమా రిలీజ్ చెయ్యడానికి దాదాపు 9 ఏళ్లు టైమ్ పట్టింది.

RRR Postpone: ఫ్యాన్స్ డిసప్పాయింట్.. డిప్రెషన్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్?

2013లో బాలీవుడ్ లో చేసిన తూఫాన్ తర్వాత 9 ఏళ్లు గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ మళ్లీ ట్రిపుల్ఆర్ తో డైరెక్ట్ బాలీవుడ్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. తూఫాన్ తర్వాత కావాలని గ్యాప్ తీసుకోలేదని, ఒక్కోసారి అలా మన ప్రమేయం లేకుండానే గ్యాప్ వచ్చేస్తుందని, బాలీవుడ్ సినిమాలు చెయ్యడానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నానన్నారు రామ్ చరణ్.

RRR Postpone: ముంచేసిన ఆర్ఆర్ఆర్.. నా తప్పేముందంటున్న జక్కన్న!

పాన్ ఇండియా మూవీగా వస్తున్న ట్రిపుల్.. ఓన్లీ తెలుగు సినిమా కాదని, ఇండియా వైడ్ గా ఉన్న ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యడానికి రాజమౌళి పాన్ ఇండియా లెవల్లో తీశారని అన్నారు రామ్ చరణ్. టాలీవుడ్ స్టార్లు.. జస్ట్ రీజనల్ హీరోలేకాదు.. బిగ్ ఇండియన్ సినిమా యాక్టర్స్ గా పిలిపించుకుంటున్నారు. రాజమౌళి బాహుబలితో రీజనల్ సినిమా బౌండరీస్ ని చెరిపేశారని, అందుకే.. బాలీవుడ్ వాళ్లు టాలీవుడ్ కి, టాలీవుడ్ వాళ్లు బాలీవుడ్ లోకి వస్తూ.. పాన్ ఇండియా యాక్టర్స్ అయిపోతున్నారన్నారు రామ్ చరణ్.