చెర్రీ కోసం ప్రొఫెషనల్ బాక్సర్..

RRR కోసం రామ్ చరణ్ స్పెషల్ ట్రైనర్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్నాడు..

  • Published By: sekhar ,Published On : May 4, 2020 / 10:21 AM IST
చెర్రీ కోసం ప్రొఫెషనల్ బాక్సర్..

RRR కోసం రామ్ చరణ్ స్పెషల్ ట్రైనర్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్నాడు..

దర్శకధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్‌, చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. ఇందులో కొమురం భీమ్ పాత్ర‌లో తార‌క్‌, అల్లూరి పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుత పరిస్థితుల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగింది. కాగా ఈ సినిమాలోని పాత్రకి సంబంధించి చ‌ర‌ణ్ లుక్ ప‌రంగా కొత్త‌గా క‌న‌ప‌డాలి.

అందుకే ఫిట్‌నెస్ పరంగా చ‌ర‌ణ్ ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ పెట్టాడు. ఇందుకోసం నీర‌జ్ గోయంక్ అనే ప్రొఫెష‌న‌ల్ బాక్స‌ర్‌ను నియ‌మించుకున్నాడు చ‌ర‌ణ్‌. రీసెంట్‌గా చ‌ర‌ణ్ వ‌ర్క‌వుట్ చేసిన త‌ర్వాత తీసిన ఫొటోను గోయంక్ త‌న పేజీలో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది. చరణ్ సరసన అలియా భట్, తారక్ పక్కన ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Also Read | బాలయ్య అల్లుడు ఎంత మారిపోయాడో.. ఈ హీరోని గుర్తు పట్టారా!