Ram Charan: నయా లుక్‌లో చరణ్ రచ్చ..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే....

Ram Charan: నయా లుక్‌లో చరణ్ రచ్చ..!

Ram Charan New Look For Rc15 Goes Viral

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటుండగా, ఈ సినిమాను పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ లుక్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Ram Charan: మళ్లీ అమృత్‌సర్ చెక్కేస్తున్న చరణ్.. ఈసారి దేనికో తెలుసా?

అయితే ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కాగా, తాజాగా సోషల్ మీడియాలో చరణ్ లుక్‌కు సంబంధించి ఓ చిన్న వీడియో క్లిప్ హల్‌చల్ చేస్తోంది. శంకర్‌తో సినిమా కోసం రామ్ చరణ్ సరికొత్త లుక్‌లోకి వెళ్లినట్లుగా ఈ లుక్ చూస్తే అర్థమవుతోంది. కొత్త హెయిర్ స్టయిల్‌తో, గుబురు గడ్డంతో చరణ్ ఫేస్‌ను సగమే చూపించారు. ఇక సినిమా షూటింగ్‌కు వెళ్లే ముందు టచప్ చేస్తున్నట్లుగా ఈ వీడియో క్లిప్ ఉండటంతో మెగా ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు.

Ram Charan: చరణ్ కోసం ఆ టైటిల్‌నే ఫిక్స్ చేస్తున్న శంకర్..?

ఈ సినిమాలోని చరణ్ లుక్‌ను పూర్తిగా ఎప్పుడెప్పుడు రివీల్ చేస్తారా అని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాలో అంజలి, సునీల్ వంటి స్టార్స్ చాలా మందే నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.