Naatu Naatu : రామ్ చరణ్, ఎన్టీఆర్ ‘నాటు నాటు’ స్టెప్పుకి ఇన్ని టేక్స్ తీసుకున్నారా??

ఇద్దరూ స్టార్ డ్యాన్సర్లు ఒకే స్టెప్ కరెక్ట్ సింక్ లో చేయడం అంటే మాటలు కాదు. ఇది చాలా కష్టం. అందుకే అందరికి నచ్చేసిన ఈ ‘నాటు నాటు’ స్టెప్పుల కోసం చెర్రీ, తారక్‌లు......

Naatu Naatu : రామ్ చరణ్, ఎన్టీఆర్ ‘నాటు నాటు’ స్టెప్పుకి ఇన్ని టేక్స్ తీసుకున్నారా??

Rrr

 

Naatu Naatu :  ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ సూపర్ డ్యాన్సర్లు. వీరిద్దరూ కలిసి ఒక్క స్టెప్ వేస్తేనే చాలు అనుకుంటాము. అలాంటిది రాజమౌళి వీళ్ళతో భారీ మల్టీస్టారర్ తీశాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో మరో చరిత్ర సృష్టించబోతున్నారు ఈ ముగ్గురు కలిసి. జనవరి 7న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా నుంచి సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇది దేశం కోసం పోరాటం చేసిన యోధుల కల్పితకథతో తీయడంతో ఇందులో కమర్షియల్ సాంగ్స్, డ్యాన్స్ ఉండవు అని అనుకున్నారు అంతా.

Chay Sam : మొత్తానికి సమంత నాగ చైతన్యకి బర్త్‌డే విషెష్ చెప్పలేదుగా…

కానీ రాజమౌళి ‘నాటు నాటు’ సాంగ్ రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. ఈ సాంగ్ చుసిన తర్వాత అభిమానులు ఉత్సాహంతో ఊగిపోయారు. తెలుగు ప్రేక్షకులతో పాటు సినీ ప్రియులంతా ఈ పాటకి ఫిదా అయిపోయారు. ఈ పాట అంతా ఒక ఎత్తు అయితే ఈ పాటకి వీరిద్దరూ కలిసి చేసిన స్టెప్స్ మరో ఎత్తు. ఈ స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది ఈ స్టెప్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Pawan Kalyan : ‘భీమ్లానాయక్‌’లో పవన్ కళ్యాణ్‌తో పాట పాడిస్తా : థమన్

అయితే ఇద్దరూ స్టార్ డ్యాన్సర్లు ఒకే స్టెప్ కరెక్ట్ సింక్ లో చేయడం అంటే మాటలు కాదు. ఇది చాలా కష్టం. అందుకే అందరికి నచ్చేసిన ఈ ‘నాటు నాటు’ స్టెప్పుల కోసం చెర్రీ, తారక్‌లు చాలా కష్టపడ్డారట. ఇద్దరూ కరెక్ట్ గా సింక్ లో చేసే దాకా రాజమౌళి వదల్లేదు అంట. ఈ పాట గురించి స్వయంగా ఎన్టీఆరే ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

Manchu Vishnu : ‘మా’ సభ్యులకు ఇచ్చిన హామీలు.. ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న మంచు విష్ణు

ఈ స్టెప్ ఫర్ఫెక్ట్‌గా సింక్‌ అయ్యేలా రావడానికి తారక్‌, చెర్రీ 18 టేక్స్‌ తీసుకున్నారట. స్టెప్స్‌ సరిగా రావడం కోసం రాజమౌళి తమకు నరకం చూపించాడంటూ నవ్వుతూ చెప్పాడు. ఇద్దరి స్టెప్పులు ఒకే రీతీలో వస్తున్నాయా లేవా అని తెలుసుకోవడానికి మధ్యలో సడెన్ గా ఆపేసేవాడట. ఇద్దరూ కరెక్ట్ గా ఒకేచోట ఆగితే సింక్ లో ఉందని అనేవాడు రాజమౌళి అని చెప్పారు. అంతే కాక రికార్డ్ చేసిన తర్వాత కెమెరాలో స్లో మోషన్ లో స్టెప్స్ సింక్ అయ్యాయో లేవో చెక్ చేసేవాడట రాజమౌళి. మొత్తానికి 18 టేక్స్‌ తీసుకున్న తర్వాత రాజమౌళి ఓకే చెప్పారట.

Rakul Preet Singh : రకుల్ పెళ్లి వాయిదా.. ఇప్పట్లో పెళ్లి చేసుకోను.. జస్ట్ ప్రేమ మాత్రమే

పాట విడుదలైన తర్వాత తమ స్టెప్పులను అందరూ పొగుడుతూ ఉంటే, వాటి గురించే మాట్లాడుతుంటే అప్పుడు రాజమౌళి విజన్‌ అర్థమైంది అన్నారు. ఆడియన్స్‌ పల్స్‌ని పట్టుకోవడంలో రాజమౌళి దిట్ట. అందుకే ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్‌ డైరెక్ట్‌గా నిలిచారు అంటూ రాజమౌళిపై ప్రసంశలు కురించాడు తారక్.