RC15 Movie Title: ఎవరూ ఊహించని ‘గేమ్ చేంజర్’గా వస్తోన్న చరణ్..!

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం RC15 మూవీ టైటిల్‌ను చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. ఈ చిత్రానికి ‘గేమ్ చేంజర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.

RC15 Movie Title: ఎవరూ ఊహించని ‘గేమ్ చేంజర్’గా వస్తోన్న చరణ్..!

Ram Charan RC15 Movie Title Announced As Game Changer

RC15 Movie Title: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం RC15 మూవీ టైటిల్‌ను చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘గేమ్ చేంజర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. ఈ టైటిల్ లోగోను తాజాగా చరణ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేశారు మేకర్స్.

RC15 Movie: రామ్ చరణ్ RC15 మూవీ రిలీజ్ డేట్ మారిందా..?

గతంలో ఈ సినిమాకు CEO, విశ్వాంభర వంటి టైటిల్స్ పేరు వినిపించాయి. అయితే చాలా మంది ఈ సినిమాకు CEO అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తారని భావించారు. సోషల్ మీడియాలోనూ ఈ టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా చిత్ర యూనిట్ మాత్రం ఔట్ ఆఫ్ ది బాక్స్ టైటిల్‌ను పట్టుకొచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. పూర్తి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుందని టైటిల్ లోగోలో రివీల్ చేసింది చిత్ర యూనిట్.

RC15 Movie: RC15 మూవీ సెట్‌లో చరణ్ బర్త్‌డే అడ్వాన్స్ సెలెబ్రేషన్స్..!

ఇక ఈ సినిమాలో ‘గేమ్ చేంజర్’గా చరణ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయగానే ‘గేమ్ చేంజర్’ ట్విట్టర్‌లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోండగా, మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.