RC15: సంక్రాంతి బరిలో ముందుగా ల్యాండ్ అవుతున్న మెగా పవర్ స్టార్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాను శంకర్ తనదైన మార్క్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా తీర్చిదిద్దుతున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద చరణ్ తనదైన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.

RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాను శంకర్ తనదైన మార్క్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా తీర్చిదిద్దుతున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద చరణ్ తనదైన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.

RC15 : చరణ్ బర్త్ డేకి టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్.. కన్‍ఫార్మ్ చేసిన దిల్ రాజు!

ఈ సినిమాలో చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాను పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాగా నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే అదే సమయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ప్రాజెక్ట్ K’ కూడా రిలీజ్ కానుంది.

RC15 : పవన్ టైటిల్ పై కన్నేసిన చరణ్.. RC15 టైటిల్ CEO కాదట!

దీంతో ఈ రెండింట్లో ఏ సినిమా ముందుగా రిలీజ్ అవుతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ RC15 మూవీని ‘ప్రాజెక్ట్-K’ కంటే ముందే జనవరి 10న థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ప్రాజక్ట్ K మూవీని జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. దీంతో సంక్రాంతి బరిలో చరణ్ ముందుగా ల్యాండ్ అవుతున్నాడని మెగా ఫ్యాన్స్ సంతోషంతో అప్పుడే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు