Ram Charan : మా కాలేజీ డీన్ మా నాన్న గారికి ఫోన్ చేసి తిట్టారు.. రామ్చరణ్!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికా టూర్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒక ఇంగ్లీష్ మీడియాకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు రామ్ చరణ్. ఈ ఇంటర్వ్యూలో పలు ఆశక్తికర విషయాలు తెలియజేశాడు.

ram charan says his college called chiru and scolded him
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తో గ్లోబల్ వైడ్ గుర్తింపు సంపాదించుకున్నాడు. చరణ్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ప్రెజన్స్ కి హాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. హాలీవుడ్ మీడియాలు సైతం జేమ్స్ బాండ్ సిరీస్ లో నెక్స్ట్ హీరోగా రామ్ చరణ్ నటించ వచ్చు అంటూ కథనాలు రాసుకొస్తున్నాయి. ప్రస్తుతం చరణ్.. RRR ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికా టూర్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒక ఇంగ్లీష్ మీడియాకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు రామ్ చరణ్. ఈ ఇంటర్వ్యూలో పలు ఆశక్తికర విషయాలు తెలియజేశాడు.
Ram Charan : నా భార్య ముందే నన్ను తిట్టారు.. దానికి ఉపాసన ఫీల్ అయ్యింది.. రామ్చరణ్!
‘చిన్నతనం నుంచి నాకు నటనపై ఆశక్తి ఉండేది. కానీ మా నాన్న గారు చదువు ముందు, ఆ తరువాతే ఏదైనా అని కాలేజీకి పంపించారు. కానీ నాకు చదువు ధ్యాసే ఉండేది కాదు. ఇంటరెస్ట్ లేకుండానే కాలేజీకి వెళ్లి వచ్చే వాడిని. నాకు చదువు మీద అసలు ఇంటరెస్ట్ లేదని గమనించిన మా కాలేజీ డీన్, నాన్నకి ఫోన్ చేశారు. మీ అబ్బాయికి ఏది ఇంటరెస్ట్ ఉంటే అది చేయనివండి. అంతేగాని ఇలా అతని సమయాన్ని వృధా చేసి, మా సమయం వృధా చేయడం సరి కాదు అంటూ చెప్పడంతో.. నేను అక్కడి నుంచి యాక్టింగ్ స్కూల్ కి షిఫ్ట్ అయ్యాను’ అంటూ వెల్లడించాడు.
అలాగే ప్రస్తుతం తన చేతిలో ఆరు ప్రాజెక్ట్ లు ఉన్నట్లు తెలియజేశాడు. వీటిలో మూడు ఈ ఏడాది, మరో మూడు వచ్చే ఏడాది రానున్నట్లు తెలియజేశాడు. ప్రస్తుతం చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 చేస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. RRR ప్రమోషన్స్ పూర్తి అవ్వగానే శంకర్ మూవీతో పాటు బుచ్చిబాబు సినిమాని కూడా పట్టాలు ఎక్కించనున్నట్లు తెలుస్తుంది. ఈ రెండిటి తరువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు.