Ram Charan: సంక్రాంతి కానుకగా చరణ్-శంకర్ మూవీ.. నిజమేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లోని 15వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాను శంకర్ తనదైన మార్క్ కంటెంట్‌తో తెరకెక్కిస్తూ, అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి పలు ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Ram Charan: సంక్రాంతి కానుకగా చరణ్-శంకర్ మూవీ.. నిజమేనా?

Ram Charan Shankar Movie To Be Released During Sankranti 2024

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లోని 15వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాను శంకర్ తనదైన మార్క్ కంటెంట్‌తో తెరకెక్కిస్తూ, అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి పలు ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Ram Charan : చరణ్ విషయంలో 10 ఏళ్ళ క్రిందటే చెప్పాను.. డైరెక్టర్ సంపత్ నంది పోస్ట్!

అయితే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ముగిస్తారా.. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకొస్తారా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. కాగా, ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే ప్రశ్నకు తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు శంకర్ అండ్ టీమ్ రెడీ అవుతోందట.

Next iPhone SE 4 Launch : భారీ OLED డిస్‌ప్లేతో ఐఫోన్ SE4 వస్తోంది.. ఇంటర్నల్ 5G మోడమ్, మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు..

ఈ మేరకు వారు రిలీజ్ డేట్‌ను ప్లాన్ చేసుకుని.. సినిమాను రిలీజ్ చేసే సమయానికి అన్ని పనులను ముగించేయాలని చూస్తున్నారట. ఇక భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి నిజంగానే చరణ్-శంకర్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.