Pawan-Charan : చరణ్-పవన్ అనుబంధం.. సీక్రెట్స్ చెప్పిన చరణ్..

బాలకృష్ణ చరణ్ కి కాల్ చేయమనగా పవన్ కాల్ చేశాడు. బాలయ్య ఫోన్ తీసుకొని చరణ్ తో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ చెప్పు అని బాలయ్య అడగడంతో చరణ్.....................

Pawan-Charan : చరణ్-పవన్ అనుబంధం.. సీక్రెట్స్ చెప్పిన చరణ్..

Ram Charan Shares Secrets of Pawan Kalyan in Unstoppable show

Pawan-Charan :  బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీ లో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సెకండ్ సీజన్ మరింత పాపులార్ అయింది. ఇక సెకండ్ సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షో దేశవ్యాప్తంగా మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఈ ఎపిసోడ్ తో సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ షో. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ షూటింగ్ మొదలయిన దగ్గర్నుంచి బాలయ్య, పవన్ అభిమానులు హంగామా చేస్తూనే ఉన్నారు. బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని ఆహా ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటల నుండి స్ట్రీమింగ్ చేశారు.

పవన్ అభిమానులు, అటు బాలకృష్ణ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. రిలీజయిన కొద్దిసేపటికే చాలామంది చూసి సరికొత్త రికార్డులని సెట్ చేశారు. కొన్ని చోట్ల అభిమానులు ఈ షోని స్పెషల్ ప్రివ్యూ వేశారు. అయితే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ మొదటి ఎపిసోడ్ లో పవన్ ఫ్యామిలీ, సినిమాలు గురించి మాట్లాడారు. ఇక రెండో ఎపిసోడ్ లో రాజకీయాలు మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. బాలయ్య – పవన్ ఎపిసోడ్ లో అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు.

పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలిలో పిల్లలందరితో చిన్నప్పట్నుంచి క్లోజ్ అని అందరికి తెలిసిందే. వాళ్ళఇంట్లో ఉన్న పిల్లలంతా తన దగ్గరే పెరిగారని చాలా సార్లు పవన్ చెప్పాడు. చరణ్, సాయి ధరమ్.. మరికొంతమంది కూడా ఇదే మాట చాలా సార్లు తెలిపారు. తాజాగా ఈ ఎపిసోడ్ లో చరణ్ గురించి అడిగాడు బాలకృష్ణ. చరణ్, నువ్వు బాగా క్లోజ్ అంటగా అని అడగగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తూ.. క్లోజ్ అవ్వాల్సి వచ్చింది. చిన్నప్పుడు పిల్లల్ని నేనే చూసుకునేవాడ్ని. అన్నయ్య షూటింగ్స్ తో బిజీగా ఉండేవారు. నాగబాబు అన్నయ్య నిర్మాతగా ఉండేవాడు. ఇంట్లో నేను ఖాళీగా ఉండటంతో దొరికిపోయి పిల్లలందర్నీ చూసుకునే బాధ్యత నా మీద పడేది. అలా క్లోజ్ అయ్యాము అని తెలిపారు.

Pawan Kalyan : నేను విగ్రహారాధన చేయను.. కానీ.. చరణ్ 200 రోజులు మాలలోనే ఉంటాడు..

బాలకృష్ణ చరణ్ కి కాల్ చేయమనగా పవన్ కాల్ చేశాడు. బాలయ్య ఫోన్ తీసుకొని చరణ్ తో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ చెప్పు అని బాలయ్య అడగడంతో చరణ్.. ఆయన లైఫ్ చాలా బోరింగ్ సర్. ఆయన దగ్గర సీక్రెట్స్ ఏం ఉండవు. ఒక్క హైదరాబాద్ బిర్యానీ మాత్రం బాగా తింటారు. వారంలో ఏడు రోజులు అదే తినమన్నా తింటారు. ఒకసారి బాబాయ్ సింగపూర్ ట్రిప్ కి వెళ్ళాడు. నేను కూడా వెళ్ళాను. అమ్మ లేదు ఇంక నేను బాబాయ్ కి నరకం చూపించాను. రోడ్డు మీద కనపడినవన్నీ కొనమని చెప్పి అన్నీ తిని వామిటింగ్స్ కూడా చేసుకున్నాను, సింగపూర్ రోడ్ల మీద. నా వల్ల బాబాయ్ ట్రిప్ అంతా పాడయింది. అప్పుడు నాకు 5 ఇయర్స్. ఆ ఏజ్ లో ఇంక ఏమంటారు, అందుకే అనలేదు. బాబాయ్ ఎప్పుడూ కొట్టలేదు కానీ ఏదన్నా తప్పు చేస్తే గంటలు గంటలు స్పీచ్ ఇచ్చేవాడు, యోగా, ధ్యానం చేయమనేవాడు. ఆయన చెప్పినవి కొన్ని రోజులు పాటించేవాడ్ని, మళ్ళీ మామూలే. కానీ ఇద్దరం చాలా క్లోజ్ అని తెలిపాడు. ఇలా చరణ్-పవన్ మధ్య ఉన్న అనుబంధాన్ని అన్‌స్టాపబుల్ వేదికగా తెలియచేశారు.