Ram Charan : సల్మాన్ సినిమాలో చరణ్ స్టెప్పులు.. పూర్తిగా సౌత్ సినిమాగా మారిపోతున్న కిసీకా భాయ్ కిసీకా జాన్..

కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా మొత్తం చాలా వరకు సౌత్ యాక్టర్స్ తోనే నింపేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే వెంకటేష్ పూజాకి అన్నయ్య క్యారెక్టర్ లో ఫుల్ లెంగ్త్ నటిస్తున్నాడు. జగపతి బాబు విలన్ గా నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇక సినిమా షూటింగ్...............

Ram Charan : సల్మాన్ సినిమాలో చరణ్ స్టెప్పులు.. పూర్తిగా సౌత్ సినిమాగా మారిపోతున్న కిసీకా భాయ్ కిసీకా జాన్..

Ram Charan Special Appearance in a song for Salman Khan Kisika Bhai Kisika Jaan Movie

Ram Charan :  ఇటీవల సౌత్ సినిమాలు, సౌత్ హీరోలు దేశమంతటా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇక RRR సినిమా తర్వాత చరణ్, ఎన్టీఆర్ కి దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. బాలీవుడ్ కూడా సౌత్ సినిమాలని, సౌత్ యాక్టర్స్ ని తమ సినిమాల్లో వాడుకొని, తమ సినిమాల కోసం వాడుకొని హిట్స్ కొట్టాలని ట్రై చేస్తుంది. ఇదే నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తన నెక్స్ట్ సినిమా కోసం అలాగే చేస్తున్నాడు.

సల్మాన్ ఖాన్ కి టాలీవుడ్ లో వెంకటేష్, చిరంజీవి, చరణ్ తో మంచి స్నేహం ఉంది. ఇటీవలే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఓ ముఖ్య పాత్రలో డబ్బులు తీసుకోకుండా చిరంజీవి కోసం నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సంవత్సరం రంజాన్ కి కిసీకా భాయ్ కిసీకా జాన్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు సల్మాన్.

అయితే కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా మొత్తం చాలా వరకు సౌత్ యాక్టర్స్ తోనే నింపేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే వెంకటేష్ పూజాకి అన్నయ్య క్యారెక్టర్ లో ఫుల్ లెంగ్త్ నటిస్తున్నాడు. జగపతి బాబు విలన్ గా నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇక సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్, రామోజీ ఫిలింసిటీలోనే జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమాలోని ఓ సాంగ్ లో సల్మాన్ తో పాటు చరణ్ స్టెప్పులు వేయనున్నాడని, పాటలో గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తాడని సమాచారం. ప్రస్తుతం చరణ్ ఆస్కారం కోసం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. చరణ్ అమెరికా నుంచి వచ్చాక ఈ పాటని షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ పాటలో సల్మాన్, చరణ్ తో పాటు పూజ హెగ్డే, వెంకటేష్ కూడా ఉండనున్నారు. మన జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేయబోతున్నారు. దీంతో ఈ సినిమాలో, సినిమాకు వర్క్ చేసిన వాళ్ళు దాదాపు చాలా మంది సౌత్ వాళ్ళే ఉండటంతో పేరుకే బాలీవుడ్ సినిమా అయినా సౌత్ సినిమానే అయిపోతుందేమో చివరికి అని కామెంట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ చరణ్, వెంకటేష్, సల్మాన్ దబాంగ్ 3 సినిమా ప్రమోషన్స్ లో స్టేజి మీద కలిసి డ్యాన్స్ వేసి ఎంటర్టైన్ చేశారు.

Pawan Kalyan : ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ చేస్తున్న పవర్ స్టార్.. టార్గెట్ 2024.. అన్ని సినిమాలు అయిపోవాలి..

టాలీవుడ్ మొత్తాన్ని సల్మాన్ ఈ సినిమా కోసమే వాడేస్తున్నట్టు ఉన్నాడు. ఇప్పుడే షూటింగ్స్ కి ఇలా వాడవుతున్నాడంటే ఇక ప్రమోషన్స్ కి ఏ రేంజ్ లో టాలీవుడ్ హీరోలని వాడతాడో చూడాలి. సల్మాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు, సల్మాన్ అభిమానులు ఇన్నాళ్లు ఎదురుచూడగా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు, వెంకటేష్, చరణ్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. మరి కిసీకా భాయ్ కిసీకా జాన్ ఏ రేంజ్ లో ప్రేక్షకులని మెప్పిస్తుందో చూడాలంటే రంజాన్ దాకా ఆగాల్సిందే.