Ram Charan : ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో చరణ్ స్పీచ్.. నందమూరి వర్సెస్ మెగా వార్ ఇప్పటికైనా ఆగుతుందా?

మెగా ఫ్యామిలీ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ఈవెంట్ కి వచ్చారు. ఎప్పట్నించి నందమూరి వర్సెస్ మెగా వార్ అభిమానుల్లో ఉందని అందరికి తెలిసిందే.

Ram Charan : ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో చరణ్ స్పీచ్.. నందమూరి వర్సెస్ మెగా వార్ ఇప్పటికైనా ఆగుతుందా?

Ram Charan Speech in NTR 100 Years Event goes viral Mega and Nandamuri Fans Appreciated

NTR 100 Years :  2023 మే 28న నందమూరి తారక రామారావు(NTR) శత జయంతి జరుగుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది నుంచి శత జయంతి ఉత్సవాల పేరిట పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిలో భాగంగానే ఇటీవల విజయవాడ(Vijayawada)లో భారీ సభ నిర్వహించగా రజినీకాంత్(Rajinikanth) ముఖ్య అతిథిగా వచ్చాడు. తాజాగా హైదరాబాద్ KPHB లో గ్రౌండ్స్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల పేరిట మరో భారీ సభను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి అనేకమంది హీరోలు వచ్చారు.

మెగా ఫ్యామిలీ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ఈవెంట్ కి వచ్చారు. ఎప్పట్నించి నందమూరి వర్సెస్ మెగా వార్ అభిమానుల్లో ఉందని అందరికి తెలిసిందే. బాలకృష్ణ, చిరంజీవి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత క్లోజ్ గా ఉన్నా అభిమానులు మాత్రం గొడవలు పడుతూనే ఉన్నారు. ఇటీవల RRR సమయంలో చరణ్, తారక్ తాము ఎంత క్లోజ్ ఉంటామో, ఎంత సరదాగా ఉంటామో చెప్పినా కూడా కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో మెగా వర్సెస్ నందమూరి వార్ చేశారు. ఇక ఎన్టీఆర్ శత జయంతి ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం, రామ్ చరణ్ రావడంతో అందరికి ఈ ఈవెంట్ పై ఆసక్తి ఏర్పడింది. చరణ్ ఏం మాట్లాడతాడా అని కూడా ఎదురు చూశారు.

ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే అంత స్థాయిలో నేను లేను. మన స్థాయిని, మన ఆలోచన స్థాయిని మించి ఎన్టీఆర్ గారు శిఖరాస్థాయిని అందుకున్నారు. అలాంటి వ్యక్తులు గురించి ఎక్కువ మాట్లాడడం కంటే, ఆయన నడిచిన దారిలో మనం నడవడమే గౌరవం. ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు నాతో సహా ప్రతి రోజు ఆయన గురించి మాట్లాడాల్సిందే. ఆయన నటించిన ఇండస్ట్రీలో నేను నటిస్తునందుకు గౌరవంగా ఉంది. సౌత్ ఇండియా పేరు ఇంటర్నేషనల్ లెవెల్ ఇప్పుడు వినిపిస్తుందని అందరూ అంటున్నారు. కానీ ఇప్పుడు మేము కాదు, ఆ కాలంలోనే దేశదేశాల్లో సౌత్ ఇండియా పేరుని వినిపించేలా చేశారు. తెలుగు ఇండస్ట్రీ బ్రతుకున్నంత వరకు ఎన్టీఆర్ అన్న పేరు బ్రతికే ఉంటుంది. ఆయన సీఎం అయ్యాక నేను ఎన్టీఆర్ తో కలిసి టిఫిన్ కూడా చేశాను. ఇప్పటికి మర్చిపోలేని విషయం, ఆయనతో అలా కలిసి టిఫిన్ చేయడం నా అదృష్టం అని అన్నారు.

Balakrishna : బాలయ్య – శివన్న సినిమాపై క్లారిటీ.. త్వరలోనే పాన్ ఇండియా మల్టీస్టారర్ ఫిలిం..

అయితే చివర్లో ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నందమూరి ఫ్యామిలీకి, బాలయ్య బాబు గారి, చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా నందమూరి అభిమానులకు చాలా థ్యాంక్స్. బాలయ్య బాబు గారు మా ఇంట్లో జరిగే అన్ని ఫంక్షన్స్ కి వస్తారు. నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నందమూరి అభిమానులను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు చరణ్. ఇక చివర్లో జై ఎన్టీఆర్ అని అన్నారు. దీంతో అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ కూడా చరణ్ ని అభినందిస్తున్నారు. చరణ్ ఈవెంట్ కి వచ్చి మాములుగా మాట్లాడటమే కాక, నందమూరి అభిమానులకు థ్యాంక్స్ చెప్పడం, నందమూరి ఫ్యామిలీని అభినందించడం, చివర్లో జై ఎన్టీఆర్ అనడం ఇవన్నీ వైరల్ గా మారాయి. మరోసారి టాలీవుడ్ లో హీరోలంతా ఒక్కటే, వాళ్ళు వాళ్ళు కలిసే ఉంటారు, అభిమానులు ఫ్యాన్ వార్స్ తగ్గించుకోవాలి అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి చరణ్ మాట్లాడిన విధానం చూసిన తర్వాత అయినా కొంతమంది అభిమానులు అందరూ ఒకటే అని అర్ధం చేసుకొని వారు చేసే మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్ వార్ ఆపుతుందేమో చూడాలి.