Ram Charan : వరుస సినిమాలతో చరణ్ బిజీ..

ట్రిపుల్ ఆర్ మేజర్ షూట్ అవ్వగానే.. చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా మొదలుపెట్టేశారు.. ‘ఆచార్య’ క్లైమాక్స్‌కి రావడంతోనే మరో సినిమా సెట్స్ మీదకి తీసుకెళుతున్నారు రామ్ చరణ్..

Ram Charan : వరుస సినిమాలతో చరణ్ బిజీ..

Ram Charan

Ram Charan: రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తో లాక్ అయిపోయారు ఎన్టీఆర్, చరణ్. ఎన్టీఆర్ మాత్రం వేరే సినిమా చెయ్యకుండా ఓన్లీ ట్రిపుల్ ఆర్ కి డెడికేట్ అయిపోయి.. సినిమాల్లో వెనకబడిపోతుంటే .. చరణ్ మాత్రం అటు ‘ఆచార్య’ ని కంప్లీట్ చేస్తూనే మరో కొత్త సినిమా మొదలుపెడుతున్నారు.

RC 15 : సీఎంగా చరణ్!.. శంకర్ ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారా?..

చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి 3 ఏళ్లుగా లాక్ అయిపోయారు హీరోలు. అయితే ఈ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ కి కంప్లీట్‌గా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ వేరే సినిమాలేవీ స్టార్ట్ చెయ్యకుండా ట్రిపుల్ ఆర్ తోనే ట్రావెల్ అవుతూ.. కెరీర్‌లో సినిమాల విషయంలో కాస్త వెనకబడ్డారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ కే కమిట్ అయ్యి ఉంటే.. చరణ్ మాత్రం సైమల్టేనియస్‌గా సినిమాలు స్టార్ట్ చేసేశారు. ట్రిపుల్ ఆర్ మేజర్ షూట్ అవ్వగానే.. చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా మొదలుపెట్టేశారు. ‘ఆచార్య’ క్లైమాక్స్‌కి రావడంతోనే మరో సినిమా సెట్స్ మీదకి తీసుకెళుతున్నారు రామ్ చరణ్. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చరణ్ అనౌన్స్ చేసిన తన 15 వ సినిమాకు సంబంధించి షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.

Ram Charan New Look : ఆచార్య ‘సిద్ధ’ న్యూ లుక్ అదిరిందిగా..!

శంకర్ – చరణ్ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఎగ్జైటింగ్‌గా ఉన్న ఫ్యాన్స్‌కి సినిమా మరో నెలలోనే మొదలుపెడుతున్నారన్న గుడ్ న్యూస్ అందించారు టీమ్. దిల్ రాజు ప్రొడక్షన్‌లో భారీ యాక్షన్ ఎలివేషన్‌తో ఉన్న చరణ్ సినిమాకు సంబంధించి స్టార్ కాస్ట్‌ని ఫైనల్ చేసే పనిలో ఉన్న శంకర్ అండ్ టీమ్.. సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్‌లో స్టార్ట్ చెయ్యడానికి ప్లాన్ రెడీ చేసుకున్నారు.