Ram Charan: బాలీవుడ్‌లో చరణ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా..? | Ram Charan To Create Sensation With Salman Khan

Ram Charan: బాలీవుడ్‌లో చరణ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్టార్‌గా తన సత్తా చాటాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ పర్ఫార్మెన్స్‌కు....

Ram Charan: బాలీవుడ్‌లో చరణ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా..?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్టార్‌గా తన సత్తా చాటాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ పర్ఫార్మెన్స్‌కు కేవలం సౌత్ ఆడియెన్స్ మాత్రమే కాదు, నార్త్ ప్రేక్షకులకు కూడా పట్టం కట్టారు. దీంతో ఈ సినిమా బాలీవుడ్ జనాలకు కూడా పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఇక చరణ్ పాత్రకు వారు మరింత మెస్మరైజ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ పాత్ర చరణ్‌కు మరోసారి బాలీవుడ్‌లో ఎంట్రీకి మార్గం సులువు చేసినట్లుగా తెలుస్తోంది.

Ram Charan: చరణ్ కోసం ఆ టైటిల్‌నే ఫిక్స్ చేస్తున్న శంకర్..?

ఇప్పటికే ఒకసారి ‘జంజీర్’ అనే సినిమాతో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న చరణ్, ఆ సినిమాతో దారుణమైన ఫెయిల్యూర్‌ను మూటగట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీలో చరణ్ నటించబోతున్నట్లుగా బీ-టౌన్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో ఓ కేమియో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ముందు నుండీ చరణ్ అంటే సల్మాన్‌కు చాలా ఇష్టం. దీంతో ఈసారి తాను నటిస్తున్న ‘కభీ ఈద్ కభీ దివాలీ’ సినిమాలో ఓ కీలక పాత్రలో చరణ్ నటించాల్సింది సల్మాన్ కోరాడట.

Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?

అయితే సల్మాన్ కోరగానే చరణ్ కూడా ఓకే అనేసినట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇక ఈ సినిమాలో కేవలం కేమియో పాత్రలో నటించడమే కాకుండా, ఓ మాస్ సాంగ్‌లో సల్మాన్‌తో కలిసి చరణ్ స్టెప్పులు కూడా వేస్తాడట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే. ఇకపోతే, చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు.

×