Ram Charan : ఫిన్లాండ్‌లో రామ్ చరణ్, ఉపాసన.. మంచులో ఆడుకుంటూ..

ప్రస్తుతం వైఫ్‌తో కలిసి ఫిన్లాండ్ లోని మంచు ప్రదేశాల్లో విహరిస్తున్నాడు రామ్ చరణ్. తాజాగా ఈ టూర్ కి సంబంధించిన ఓ వీడియోని ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. మంచు తివాచీ.........

Ram Charan : ఫిన్లాండ్‌లో రామ్ చరణ్, ఉపాసన.. మంచులో ఆడుకుంటూ..

Ram Charan

 

Ram Charan :  త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రమోషన్స్ ని మళ్ళీ మొదలు పెట్టనున్నారు. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియాలో లేడు. రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఫిన్లాండ్ విహార యాత్రకి వెళ్ళాడు. ప్రస్తుతం రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఈ టూర్ ఎంజాయ్ చేస్తున్నారు. నిత్యం షూటింగ్స్, వర్క్ అంటూ బిజీగా ఉండే వీరిద్దరూ కాస్త గ్యాప్ దొరకడంతో ఇలా మంచు ప్రదేశాలకి వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేశారు.

ప్రస్తుతం వైఫ్‌తో కలిసి ఫిన్లాండ్ లోని మంచు ప్రదేశాల్లో విహరిస్తున్నాడు రామ్ చరణ్. తాజాగా ఈ టూర్ కి సంబంధించిన ఓ వీడియోని ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. మంచు తివాచీ పరిచినట్టుగా ఉన్న ఆ ప్రదేశంలో ఉపాసన, రామ్ చరణ్ ఫొటోలకు పోజులిచ్చారు. చలి కాచుకుంటూ అక్కడి స్పెషల్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక విమానాశ్రయంలో ట్రాలీ మీద ఎక్కి ఇద్దరూ సరదాగా ఆడుకున్నారు. వీటన్నిటిని ఒక వీడియో చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఉపాసన.

Krishnam Raju : ప్రభాస్ పిల్లలతో ఆడుకోవాలని ఉంది

ఈ వీడియోని షేర్ చేసి.. ”భూమి మీద ఉన్న అత్యంత ఆనంద ప్రదేశంలో చాలా ఆనందంగా ఉన్నాం” అంటూ పోస్ట్ చేసింది. వీరితో పాటు ఉపాసన స్నేహితులు మరో జంట కూడా ఈ ట్రిప్ లో భాగమైంది. ఈ ఫోటోలు, వీడియోలు చూసి అభిమానులు ఆనందిస్తూ ఎంజాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే తిరిగివచ్చి రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు.