Ram Charan: శ్యామ్ దర్శకుడితో చెర్రీ.. ఇది కూడా యూనివర్సల్ కాన్సెప్టే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా హీరోగా మారడం ఖాయం. ఆర్ఆర్ఆర్ తో కలిసి వచ్చే స్టార్ డమ్ ను నిలబెట్టుకునేందుకు ఆర్ఆర్ఆర్ తర్వాత కూడా అదే స్థాయి సినిమాలను..

Ram Charan: శ్యామ్ దర్శకుడితో చెర్రీ.. ఇది కూడా యూనివర్సల్ కాన్సెప్టే!

Ram Charan (1)

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా హీరోగా మారడం ఖాయం. ఆర్ఆర్ఆర్ తో కలిసి వచ్చే స్టార్ డమ్ ను నిలబెట్టుకునేందుకు ఆర్ఆర్ఆర్ తర్వాత కూడా అదే స్థాయి సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఇప్పటికే దక్షణాది మరో దిగ్గజం శంకర్ తో సినిమా మొదలు పెట్టిన రామ్ చరణ్ ఆ సినిమా తర్వాత జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో మరో పాన్ ఇండియా సినిమాకు ఒకే చెప్పాడు. శంకర్ సినిమా సెట్స్ మీద ఉండగానే గౌతమ్ తో సినిమా ఒకే చేసిన చరణ్ ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సింగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Bangarraju: అక్కినేని హీరోల దూకుడుకి బ్రేకేసిన కోవిడ్..!

నానీ శ్యామ్ సింగరాయ్ సినిమాతో రాహల్ సాంకృత్యాన్ స్టార్ హీరోల దృష్టిలో పడ్డాడు. శ్యామ్ సింగరాయ్ పాన్ ఇండియా స్థాయి కథే అయినా ఎందుకో ఆ సినిమాను ఇండియన్ సినిమాగా ప్లాన్ చేయలేదు. అయితే.. సౌత్ అన్ని బాషలలో విడుదలైన శ్యామ్ సింగరాయ్ దక్షణాది అన్ని బాషలలో అదరగొట్టింది. ఈ సినిమా సక్సెస్ తో రాహుల్ తర్వాత సినిమాను పాన్ ఇండియా సినిమాగా ప్లాన్స్ మొదలు పెట్టాడు. ఇందుకోసం ఓ యూనివర్సల్ కథను ఎంచుకున్న రాహుల్.. రామ్ చరణ్ కు కథను వినిపించినట్లు తెలుస్తుంది.

Sir Movie: ధనుష్ సినిమా నుండి భీమ్లా నాయక్ భామ అవుట్?

రాహుల్ కథకు ఫిదా అయిన రామ్ చరణ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుండగా.. ఆ కథను ఇంకా డెవలప్ చేయాల్సి ఉందట. ఈ సినిమా పట్టాలెక్కేందుకు ఇంకా చాలా సమయం ఉండగా.. ప్రస్తుతం అధికారిక ప్రకటన కోసమే మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే రాహుల్ రేంజ్ మరింత పెరగడంతో ఖాయంగా కనిపిస్తుంది.