RGV: అందరూ బాగుండాలనుకొనే హీరోలే లేరు.. ఇండస్ట్రీకి పెద్ద అవసరం లేదు Ram Gopal Varma about film industry and MAA Elections

RGV: అందరూ బాగుండాలనుకొనే హీరోలే లేరు.. ఇండస్ట్రీకి పెద్ద అవసరం లేదు

తెలుగు సినిమా రంగంలో దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు ఛరిస్మా గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఏ కష్టం వచ్చినా పెద్ద దిక్కుగా మరి అందరి బంధువుగా పేరు తెచ్చుకున్నారు. అయితే..

RGV: అందరూ బాగుండాలనుకొనే హీరోలే లేరు.. ఇండస్ట్రీకి పెద్ద అవసరం లేదు

RGV: తెలుగు సినిమా రంగంలో దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు ఛరిస్మా గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఏ కష్టం వచ్చినా పెద్ద దిక్కుగా మరి అందరి బంధువుగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఆయన తదనంతరం అంతటి స్థాయి ఉన్న వ్యక్తులెవరన్నది చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ అంశంపై పలుమార్లు వివాదాస్పదమైన సంగతి కూడా తెలిసిందే. ఈ మధ్యనే మా ఎన్నికల సమయంలో కూడా ఈ అంశం మరోమారు చర్చకు రావడం.. దీనిపై రకరకాల విమర్శలు కూడా వినిపించాయి. అయితే.. అసలు ఇండస్ట్రీకి పెద్ద అవసరమే లేదని.. దర్శకుడు ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

RGV: నా దృష్టిలో హీరోలే లేరు.. నా కథలో అంతకన్నా ఉండరు

తాజాగా 10 టీవీ క్వశ్చన్ అవర్ లో పాల్గొన్న వర్మ ఇండస్ట్రీలో పరిస్థితులు.. మా ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం కానేకాదన్న వర్మ ఇక్కడ ఎన్నో కుటుంబాలు కలిసి వాళ్ల కోసం వాళ్ళే బ్రతుకుతున్నారన్నారు. సినీ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా హీరోలందరూ బాగుండాలని కోరుకోరని.. ఏ స్టార్ మిగతా వాళ్ళు స్టార్స్ గా ఎదగాలని కోరుకోడని.. అలా చెప్పేవన్నీ పనికిమాలిన మాటలేనని తీసిపారేశారు. ఒక్క నటులే కాదు.. ఏ నిర్మాత, ఏ దర్శకుడు, ఏ టెక్నీషియన్ కూడా అలా అందరూ ఎదగాలని కోరుకోరన్నారు.

RGV: ఆరు వందల ఓట్ల కోసం జీరోలైన హీరోలు.. మాపై వర్మ!

అసలు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అనేది సాధ్యమే కాదన్నారు వర్మ. ఎవరికి వాళ్ళు రైట్ అనుకుంటేనే వివాదం అవుతుందని.. అలాంటపుడు ఓ పెద్ద ఒక్కరి తరపున వాళ్ళు రైట్ అని చెప్తే ఇంకొకరు ఎలా వింటారని ప్రశ్నించిన వర్మ.. కోర్టులాగా పెద్ద దిక్కు అనే వాళ్ళు ఇండస్ట్రీకి సెట్ కారని చెప్పారు. ఎవరైనా వాళ్ళకి లాభం జరిగేలా ఉంటేనే ఏ పెద్ద మాటైనా ఇక్కడ వింటారు తప్ప నష్టం జరుగుతుందంటే ఎవరూ వినరని.. పెద్ద దిక్కు ఎవరూ అందరికీ లాభం జరిగేలా పనిచేయలేరని చెప్పారు.

×