Publish Date - 3:34 am, Wed, 3 April 19
By
vamsiలక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టిన రామ్ గోపాల్ వర్మ.. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ గురించి సంచలన ట్వీట్లు చేశారు. టీడీపీకి వారసుడిగా లోకేష్‌ని ప్రజెంట్ చేస్తుంటే.. నారా లోకేష్ ఓ అబద్ధం అంటూ వర్మ విమర్శలు గుప్పించారు. టీడీపీకి అసలైన ఫ్యూచర్ జూనియర్ ఎన్టీఆరే అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. అంతేకాదు… తారక్‌తో పాటూ… నిజాయితీ గల ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా… లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూసిన తర్వాతే ఓటు వెయ్యాలని కోరాడు.
ఇదిలా ఉంటే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై స్టే రావడంతో చిత్ర డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టు మెట్లెక్కారు. ఈ క్రమంలో ఇవాళ(3 ఏప్రిల్ 2019) సినిమాను చూసిన తర్వాత న్యాయమూర్తులు ఏపీలో విడుదల చేయాలా? వద్దా? అనే విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగేవరకు అంటే ఏప్రిల్ 11 వరకూ ఆగమని న్యాయమూర్తులు చెబితే మాత్రం మరో వారం సినిమాకి బ్రేక్ పడే అవకాశం ఉంది.
All truly real and realistic honest fans of NTR and @tarak9999 should cast their vote only after seeing @ncbn in #LakshmisNTR ..@naralokesh is a false heir to @jaiTDP and only true heir is the fantastic @tarak9999
who should be the only true honest future of TDP— Ram Gopal Varma (@RGVzoomin) April 2, 2019
Ugadi Panchangam 2021 : జగన్, కేసీఆర్ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి? చంద్రబాబు భవిష్యత్తు ఏంటి?
RRR : తెలుగు ప్రజలకు భీమ్, రామరాజు ఉగాది శుభాకాంక్షలు..
NTR 30 : తారక్ – కొరటాల క్రేజీ కాంబినేషన్.. వన్స్ మోర్!..
Jr.Ntr : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం ఎన్టీఆర్ వేసుకున్న బ్లేజర్ రేటు ఎంతంటే…
AP Corona Cases : ఏపీలో 24 గంటల్లో 3,495 కరోనా కేసులు
Break For Vaccination : విశాఖ, అనంతపురం జిల్లాల్లో టీకా ఉత్సవ్‌కు బ్రేక్