RGV-Upendra: ఉప్పీతో ఆర్జీవీ.. మరోసారి మాఫియా యాక్షన్ డ్రామా!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు ఆర్జీవి. రాను రాను హిట్ అనే మాటకి దూరమైపోయిన ఆర్జీవీ..

RGV-Upendra: ఉప్పీతో ఆర్జీవీ.. మరోసారి మాఫియా యాక్షన్ డ్రామా!

Rgv Upendra

RGV-Upendra: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు ఆర్జీవి. రాను రాను హిట్ అనే మాటకి దూరమైపోయిన ఆర్జీవీ.. వివాదాలను వెతుక్కుని మరీ కొనితెచ్చుకుని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటాడు. ఇక ఈ మధ్యకాలంలో బోల్డ్ ఇంటర్వ్యూలతో పాటు బోల్డ్ సినిమాలతో సంచలనాలకు కేరాఫ్ అవుతున్నాడు. అయితే తనకు నచ్చిన కాన్సెప్ట్ తో విన్నూత్నంగా ఆలోచించి సినిమాలు తీసే ఆర్జీవీ ఈ సారి నటుడు ఉపేంద్రతో రాబోతున్నాడు.

RGV: నా చిన్నప్పుడు పెద్దవాళ్లంతా ఇడియట్స్‌ అనుకునేవాడిని.. వర్మ ట్వీట్!

కన్నడనాట తరగని క్రేజ్ సొంతం చేసుకున్న ఉప్పీ..నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా సినీ ప్రియులను మెప్పించాడు. కన్యాదానం, ‘ఉపేంద్ర, ఒకే మాట, రా!, నీతోనే ఉంటాను, టాస్, సెల్యూట్, సన్నాఫ్‌ సత్యమూర్తి వంటి తెలుగు చిత్రాల్లో హీరోగా, కీలక పాత్రల్లోనూ నటించిన ఉప్పీ.. త్వరలో రాబోయే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న ‘ఘని’లోనూ ఉపేంద్ర కీ రోల్ లో కనిపించనున్నారు. కాగా.. ఇప్పుడు ఆర్జీవీ అండ్ కంపెనీ ఏకంగా ఉప్పీతో సినిమాను ప్రకటించి సెన్సేషనల్ గా మారాడు.

Upendra : మళ్ళీ డైరెక్టర్‌గా ఉపేంద్ర.. సింగిల్ లెటర్ టైటిల్‌తో పాన్ ఇండియా సినిమాగా..

గురువారం వర్మ ఉపేంద్రతో సినిమా మోషన్ టీజర్ ని షోషల్ మీడియా ట్వీట్టర్ వేదికగా విడుదల చేయగా.. `R` అనే టైటిల్ ని ఫిక్స్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. బెంగళూరులో హల్ చల్ సృష్టించిన `R` గ్యాంగ్ దుబాయ్ లో వున్న దీ కంపనీ అధినేత అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంని కూడా వణికించిందట. అలాంటి `R` పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నారు. `R` ఓ గ్యాంగ్ స్టర్ లా కాకుండా చిన్న టైమ్ స్ట్రీట్ ఫైటర్ గా ప్రారంభించి ఆపై బెంగళూరులోనే కాకుండా ముంబైలోని మాఫియాను దుబాయ్ లో వున్న డీ కంపెనీని కూడా భయభ్రాంతులకు గురిచేశాడట. అలాంటి హడలెత్తించిన `R` పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నాడని వర్మ ట్వీట్ చేశాడు.