Bhimla Nayak: భీమ్లా నాయక్ భూకంపం.. అలా చేసి ఉంటే సంచలనమే – రామ్ గోపాల్ వర్మ

పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

Bhimla Nayak: భీమ్లా నాయక్ భూకంపం.. అలా చేసి ఉంటే సంచలనమే – రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma

Bhimla Nayak: పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు సూపర్ సక్సెస్ టాక్ వస్తోండగా.. ఈ సినిమాపై లేటెస్ట్‌గా సంచలనాల సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

భీమ్లా నాయక్ ఉరుము అయితే, పవన్ కళ్యాణ్ సునామీ లాంటి వ్యక్తియని, రానా దగ్గుబాటి నెక్ టూ నెక్ నటించారని సినిమా ఓ భూకంపం వంటిదని చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ.

అలాగే, నేను పదే పదే చెబుతున్నట్లుగానే భీమ్లానాయక్‌ని హిందీలో కూడా విడుదల చేస్తే బాగుంటుందని, అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఉండేదని అన్నారు.