వైన్ షాప్ క్యూ లో నిలబడ్డ ఆడవాళ్లపై వర్మ కామెంట్స్.. సాలిడ్ కౌంటర్ ఇచ్చిన సింగర్..

రామ్ గోపాల్ వర్మ ట్వీట్‌కు సింగర్ సాలిడ్ రిప్లై..

  • Published By: sekhar ,Published On : May 4, 2020 / 04:00 PM IST
వైన్ షాప్ క్యూ లో నిలబడ్డ ఆడవాళ్లపై వర్మ కామెంట్స్.. సాలిడ్ కౌంటర్ ఇచ్చిన సింగర్..

రామ్ గోపాల్ వర్మ ట్వీట్‌కు సింగర్ సాలిడ్ రిప్లై..

కాంట్రవర్శీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ఏవిషయానికి ఎలా రియాక్ట్ అవుతాడో, ఏ సంఘటనను తన పబ్లిసిటీ పిచ్చికి వాడుకుంటాడో అస్సలు తెలియదు. తాజాగా ట్విట్టర్‌‌లో వర్మ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. అంతేకాదు ఆర్జీవీకి సింగర్ సోనా అదిరిపోయే ఆన్సర్ ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇన్ని రోజులుగా మూత పడ్డ మందు షాపులు తెరుచుకోవచ్చని కేంద్రం ఆదేశాలు జారీ చేయగా మే 4వ తేదీ ఉదయం నుండి షాపులు ఓపెన్ అయ్యాయి.

మద్యం కోసం మగాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా క్యూ కట్టారు. వైన్‌ షాపుల ఎదుట మహిళలు వరుసలో నిలబడి ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘‘చూడండి మద్యం షాపుల వద్ద ఎవరు క్యూలో ఉన్నారో. అవును పాపం, తాగే పురుషుల నుంచి మహిళలను రక్షించడం చాలా ముఖ్యం..’’ అంటూ వెటకారపు వోడ్కా ట్వీట్ చేశాడు వర్మ.

దీనిపై బాలీవుడ్‌ సింగర్‌ సోనా మోహపాత్రా స్పందిస్తూ.. ‘‘డియర్‌ మిస్టర్‌ ఆర్జీవీ, ఈ ట్వీట్‌ అసలైన విద్యావంతులు ఎలా ఉండాలో అని నేర్పించే వ్యక్తుల వరుసలో మిమ్మల్ని చేరుస్తుంది. మీ ట్వీట్ సెక్సిజం, నైతికత రీక్స్ అర్థానికి వీలుగా ఉంది. మహిళలకు, పురుషుల మాదిరిగా మద్యం కొనుగోలు, మద్యం సేవించే హక్కు ఉంది. అయితే మద్యం సేవించాక హింసాత్మకంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు..’’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం అమ్మకాలు తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై బాలీవుడ్‌ రచయిత జావేద్‌ అక్తర్‌, నటి మలైకా అరోరా, రవీణా టాండన్‌ తదితరులు నిరసన వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే.