లాక్‌డౌన్ : క్వారంటైన్‌లో ఉన్నవాళ్లంతా ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా చూడండంటూ ట్వీట్ చేసిన ఆర్జీవీ..
Publish Date - 12:51 pm, Sun, 29 March 20
By
sekharలాక్‌డౌన్ : క్వారంటైన్‌లో ఉన్నవాళ్లంతా ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా చూడండంటూ ట్వీట్ చేసిన ఆర్జీవీ..
కరోనా మహమ్మారి ప్రభావంతో సెలబ్రిటీల దగ్గరి నుండి సామాన్యుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కేంద్ర ప్రభుత్వం 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎవరికి నచ్చిన పనులతో వాళ్లు కాలక్షేపం చేస్తున్నారు. క్వారంటైన్ టైమ్‌లో ఎలాంటి పనులు చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను వీడియోల రూపంలో ప్రేక్షకులతో పంచుకుంటున్నారు సెలబ్రిటీలు. ఏ టైమ్ ఎలా ఉన్నా తన పనిలో తానుండే వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ క్వారంటైన్ సమయంలో నెలకి వెయ్యి గంటలు ఉన్నట్లు అనిపిస్తోంది. సమయం అస్సలు కదలట్లేదు అని ట్వీట్ చేస్తూ.. లాక్‌డౌన్ నేపథ్యంలో కరోనాపై రకరకాల ట్వీట్లు వదులుతున్నాడు.
తాజాగా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబులకు క్వారంటైన్ టైములో ఈ సినిమా చూడండి అంటూ కొద్దిసేపటి క్రితం ఓ పోస్ట్ చేశాడు వర్మ. చంద్రబాబు, లోకేష్‌తో సహా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా అమెజాన్ ప్రైమ్‌లో ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా చూడండి. మీ విలువైన సూచనలు ఇవ్వండి ’ అంటూ ప్రైమ్ లింక్ షేర్ చేసాడు ఆర్జీవీ.
Since everyone including CBN and LOKESH gaaru also are quarantined I request both of them to watch “Amma Rajyamlo Kadapa Biddalu” on Amazon Prime and give me their valuable feedback??? https://t.co/ontV8m0v8c
— Ram Gopal Varma (@RGVzoomin) March 29, 2020
MLC Kavitha : తెలంగాణలో కరోనా పంజా, హెల్ప్ లైన్ నెంబర్ల ఏర్పాటు..ఎమ్మెల్సీ కవిత ట్వీట్
Lockdown In Maharashtra : విజృంభిస్తున్న కరోనా…లాక్‌డౌన్ దిశగా మహారాష్ట్ర
Covid-19 : వ్యాక్సిన్ రెండుసార్లు తీసుకున్నా వదలని కరోనా..
TV Serials : టీవీ సీరియల్స్ షూటింగ్ లు రద్దు
India : కరోనా ఉధృతం, అల్లాడుతున్న నాలుగు రాష్ట్రాలు
Covid report : ఏపీలో కొత్తగా 2,765 కరోనా కేసులు