Ram Lakshman : మీ హీరోని బాగా కష్టపెట్టాం..

ఈ ఈవెంట్ లో రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ''కరోనాలు దాటుకొని ఈ సినిమా ముందుకొస్తుంది. బాబుతో మాకు ఇది నాలుగో సినిమా. ఈ సినిమాలో ఇంటర్వెల్ దగ్గర...

Ram Lakshman : మీ హీరోని బాగా కష్టపెట్టాం..

Ram Lakshman

 

Sarkaru Vaari Paata  :  సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇవాళ (మే 7న) హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.

Mahesh Babu : అభిమానులకి మహేష్ స్పెషల్ లేఖ..

 

ఈ ఈవెంట్ లో రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ”కరోనాలు దాటుకొని ఈ సినిమా ముందుకొస్తుంది. బాబుతో మాకు ఇది నాలుగో సినిమా. ఈ సినిమాలో ఇంటర్వెల్ దగ్గర, క్లైమాక్స్ దగ్గర మీ హీరోని చాలా కష్టపెట్టాం. అభిమానులని మెప్పించడానికి మేము చాలా కష్టపడ్డాం. మాతో పాటు మహేష్ బాబుని కూడా కష్టపెట్టాం. నాతో పాటు మా టీం అంతా ప్రాణాలకి తెగించి మరీ మంచి ఫైట్స్ కోసం కష్టపడతారు” అని తెలిపారు.