Ram Pothineni : బొంగులో నా లిమిట్స్.. రామ్ బోయపాటి మాస్ రచ్చ..

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న మూవీ నుంచి అదిరిపోయే గ్లింప్స్‌ వచ్చేసింది.

Ram Pothineni : బొంగులో నా లిమిట్స్.. రామ్ బోయపాటి మాస్ రచ్చ..

Ram Pothineni Boyapati Srinu movie glimpse released

BoyapatiRAPO : టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ పోస్టర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. నేడు (మే 15) రామ్ పుట్టినరోజు కావడంతో మూవీ నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ ని విడుదల చేసి అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చారు.

Ram Pothineni: రామ్ కోసం బోయపాటి మరొక బ్యూటీని దించుతున్నాడుగా!

ఇక ఈ సినిమా కోసం రామ్ కొంచెం లావు అయ్యినట్లు కనిపిస్తుంది. గ్లింప్స్ మొత్తాన్ని యాక్షన్ సీక్వెన్స్ తో నింపేసాడు బోయపాటి. ఇక ఈ గ్లింప్స్ లో రామ్ చెప్పిన మాస్ డైలాగ్.. “నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా. నీ గేట్ దాటలేనన్నావ్ దాటా. నీ పవర్ దాటలేనన్నావ్ దాటా. ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్” అదిరిపోయింది. కాగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయడానికి కొంత సమయం పడుతుందని ఇటీవల చిత్ర నిర్మాత చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Ram Pothineni : వివాదాల మధ్య పూరీ, రామ్ డబల్ ఇస్మార్ట్.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్!

ఈ సినిమాలో రామ్ కి జోడిగా శ్రీలీల (Sreeleela) నటిస్తుంది. పాన్ ఇండియా వైడ్ ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 20న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. రామ్ గత రెండు చిత్రాలు ప్లాప్ గా నిలిచాయి. ఇక అఖండతో సూపర్ హిట్టుని అందుకున్న బోయపాటి శ్రీను రామ్ కి కూడా హిట్ అందిస్తాడా? లేదా? చూడాలి.