Ram Pothineni : రామ్, బోయపాటి మూవీ గ్లింప్స్‌కి డేట్ ఫిక్స్.. టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

రామ్, బోయపాటి శ్రీను సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ నుంచి ఒక పవర్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత ప్రకటించాడు.

Ram Pothineni : రామ్, బోయపాటి మూవీ గ్లింప్స్‌కి డేట్ ఫిక్స్.. టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

Ram Pothineni Boyapati Srinu movie glimpse released on ram birthday

Ram Pothineni : ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మొదటి మూవీ ఇది. ఎనర్జిటిక్ హీరో రామ్ కి బోయపాటి మాస్ యాడ్ అయితే సిల్వర్ స్క్రీన్ పై మాస్ జాతరే అంటూ రామ్ అభిమానులు ఈ మూవీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఆ పోస్టర్ లో రామ్ రింగులు జుట్టు, గుబురు గడ్డంతో పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.

Project K : ప్రభాస్ ప్రాజెక్ట్ K పోస్ట్‌పోన్.. రీజన్ అదేనట!

కాగా ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసా నిర్మిస్తున్నాడు. ఇటీవల ఒక మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ నిర్మాత.. రామ్, బోయపాటి సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు. మే 15వ తేదీన రామ్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజు మూవీ నుంచి ఒక పవర్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. సినిమా టైటిల్ ఏంటి అనేది ఇప్పుడే చెప్పమని, దానికి కొంచెం సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు. మరి బర్త్ డే రోజు వచ్చే గ్లింప్స్ ఆడియన్స్ ని ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Adipurush : మరో వివాదంలో ఆదిపురుష్.. చిత్రయూనిట్ పై ఫైర్ అవుతున్న యూట్యూబర్స్..

ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల (Sreeleela) నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. అక్టోబర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. కాగా రామ్ గత రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. దీంతో ఈ మూవీ పై రామ్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తో ఫుల్ ఫార్మ్ లో ఉన్న బోయపాటి రామ్ కి హిట్ అందిస్తాడా? లేదా? చూడాలి.