Ram Pothineni: బోయపాటి కోసం ఫ్యామిలీతో బిజీగా ఉన్న రామ్..!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన కొత్త సినిమాను తెరకెక్కిస్తు్న్నాడు. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Ram Pothineni: బోయపాటి కోసం ఫ్యామిలీతో బిజీగా ఉన్న రామ్..!

Ram Pothineni Busy With Family Scenes For Boyapati Sreenu

Ram Pothineni: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన కొత్త సినిమాను తెరకెక్కిస్తు్న్నాడు. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Ram Pothineni: బాలీవుడ్ పాపతో రామ్ చిందులు.. బోయపాటి టార్గెట్ అదేనా?

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తుంది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్‌లో ఫ్యామిలీ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. రామోజీ ఫిలిం సిటీలో భారీ క్యాస్టింగ్‌తో ఈ షూటింగ్ నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ షూటింగ్‌లో హీరో రామ్‌తో పాటు హీరోయిన్ శ్రీలీల కూడా పాల్గొంటుందని తెలుస్తోంది.

Ram Pothineni: రామ్‌తో సినిమాపై గౌతమ్ క్లారిటీ!

ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్‌తో కనిపిస్తుండగా, బోయపాటి తనదైన మార్క్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కి్స్తున్నాడు. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.