The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ‘ది వారియర్’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. తమిళ దర్శకుడు లింగుస్వామి....

Ram Pothineni Power Packed Trailer Of The Warrior Impressive
The Warrior Trailer: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ‘ది వారియర్’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో రామ్ పోతినేని తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌ను పవర్‌ప్యాక్డ్‌గా ప్రెజెంట్ చేశారు చిత్ర యూనిట్.
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
కర్నూలు సిటీలో కొత్త డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న రామ్, అక్కడ గురు అనే వ్యక్తి చేసే అన్యాయాలను ఏ విధంగా ఎదుర్కొంటాడు అనేది మనకు సినిమా కథగా చూపించబోతున్నారు. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ లుక్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు చిత్ర యూనిట్. అతడు చెప్పే డైలాగులు కూడా గూస్బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. ఇక ఈ ట్రైలర్లో రామ్ మరో లుక్‌లోనూ మనకు కనిపిస్తున్నాడు. అటు గురు పాత్రలో నటుడు ఆది పినిశెట్టి హైలైట్‌గా ఉన్నాడు. అతడి స్లాంగ్, అతడి లుక్స్ గురు పాత్రను ఈ సినిమాకే హైలైట్‌గా చేయడం ఖాయమని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కర్నూలులో గురు ఆధిపత్యంపై పోలీస్ ఆఫీసర్‌గా రామ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడనేది మనం సినిమాలో చూడాల్సిందే.
The Warrior: విజిల్ వేయిస్తున్న వారియర్.. ఎప్పుడంటే?
మొత్తానికి లింగుస్వామి ఓ పవర్ఫుల్ కథతో రామ్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించడం ఖాయమని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక అందాల భామ కృతి శెట్టికి సంబంధించి ట్రైలర్లో కొన్ని సెకన్స్ మాత్రమే విజువల్స్ చూపించారు. మరి సినిమాలో ఆమె పాత్రకు మంచి స్కోప్ ఉంటుందని ఆశిద్దాం. ఇక ఈ సినిమాను జూలై 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాకు టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, శ్రీనివాస చెట్టూరి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.