Ram Pothineni : వివాదాల మధ్య పూరీ, రామ్ డబల్ ఇస్మార్ట్.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్!

రామ్ పోతినేని, పూరీజగన్నాధ్ కలయికలో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఇప్పుడు మరోసారి ఈ హిట్ కాంబినేషన్ తెరపైకి వస్తుంటే..

Ram Pothineni : వివాదాల మధ్య పూరీ, రామ్ డబల్ ఇస్మార్ట్.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్!

Ram Pothineni Puri Jagannadh Double ISmart announce and release date

Ram Pothineni Double ISmart : ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం తన 20వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ సోమవారం (మే 15) రామ్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో రామ్ నటిస్తున్న, నటించేబోయే సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇస్మార్ట్ శంకర్ (ISmart Shankar) కాంబినేషన్ ని మళ్ళీ తెర పైకి తీసుకు వస్తూ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 2019 లో పూరీజగన్నాధ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత ఈ సినిమా సీక్వెల్ పై చాలా వార్తలు బయటకి వచ్చాయి.

Ram Pothineni : రామ్, బోయపాటి మూవీ గ్లింప్స్‌కి డేట్ ఫిక్స్.. టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మూవీ రాబోతుందని ప్రకటించడంతో.. కొత్త కథతో వస్తున్నారా? లేదా సూపర్ హిట్ అయిన ఇస్మార్ట్ కి సీక్వెల్ ని తీసుకు వస్తున్నారా? అనే సందేహం మొదలైంది. తాజాగా ఆ సస్పెన్స్ ని బ్రేక్ చేస్తూ.. ఇస్మార్ట్ కి సీక్వెల్ అని ప్రకటించారు. డబుల్ ఇస్మార్ట్ అంటూ టైటిల్ ని అనౌన్స్ చేసిన మూవీ టీం.. రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. ఈసారి పాన్ ఇండియా వైడ్ ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.

Puri Jagannadh : అగ్ర హీరోలెవరూ పూరీ జగన్నాథ్‌కు కాల్షిట్లు ఇవ్వొద్దు.. తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం!

ఇది ఇలా ఉంటే, లైగర్ (Liger)మూవీ విషయంలో దర్శకుడు పూరీ ఎగ్జిబిటర్లతో సమస్యని ఎదురుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ వివాదం ముదిరి నిరాహార దీక్షకు వరకు చేరుకుంది. హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ వద్ద తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం నిరసన తెలియజేశారు. తమ సమస్య తీరే వరకు ఇండస్ట్రీలోని ఏ స్టార్ హీరో పూరికి అవకాశం ఇవ్వొద్దు అంటూ కోరారు. అయితే రామ్ అవేవి పట్టించుకోకుండా పూరీజగన్నాధ్ కి అవకాశం ఇవ్వడం గమనార్హం.