Bullet Song: సోషల్ మీడియాను ఊపేస్తున్న బుల్లెట్ సాంగ్..!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.....

Bullet Song: సోషల్ మీడియాను ఊపేస్తున్న బుల్లెట్ సాంగ్..!

Ram Pothineni The Warrior Bullet Song Creates New Record

Bullet Song: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు ఈ యంగ్ హీరో రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తుండటంతో తెలుగులోనే కాకుండా ఈ సినిమాపై తమిళనాట కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ది వారియర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Bullet Song : చెన్నైలో రామ్, కృతి బుల్లెట్ సాంగ్ తమిళ్ వర్షన్ లాంచ్ ఈవెంట్

ఇక ఈ సినిమాలోని ‘బులెట్ సాంగ్’ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో అలరిస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ కంపోజింగ్‌కు హీరో రామ్‌తో పాటు అందాల భామ కృతి శెట్టి వేసిన స్టెప్స్ మరో లెవెల్ అని చెప్పాలి. వారు చేసిన ఈ డ్యాన్స్ స్టెప్స్‌కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అంతేగాక ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్‌ను అందించారు. తాజాగా ఈ పాట సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ పాట తెలుగు, తమిళ వర్షన్లలో ఏకంగా 125 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో ఈ పాట ఏకంగా 11 బిలియన్ సార్లు ప్లే అయ్యింది.

The Warrior : శింబు పాటకి.. రామ్, కృతిశెట్టి బుల్లెట్ స్టెప్పులు..

మోజ్, ఇన్‌స్టా రీల్స్, స్పాటిఫై వంటి ఇతర యాప్స్‌లో ఈ పాటకు విపరీతమైన క్రేజ్ నెలకొంది. దీంతో ఈ పాటపై ఆయా యాప్ యూజర్లు డ్యాన్సులు వేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ బులెట్ సాంగ్ పాట ఈ రేంజ్‌లో హిట్ కావడంతో ది వారియర్ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో రామ్ పోతినేని తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా చూస్తున్నారు. జూలై 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.