The Warrior: ది వారియర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఎలా ఉన్నాయంటే?

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ జూలై 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అనే ముద్ర వేసుకోవడంతో ‘ది వారియర్’ తొలి వారం వసూళ్లపై అది ప్రభావం చూపింది.

The Warrior: ది వారియర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఎలా ఉన్నాయంటే?

Ram Pothineni The Warrior First Week Collections

The Warrior: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ రిలీజ్‌కు ముందర ఎలాంటి అంచనాలు క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో రామ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశించారు. ఇక మంచి అంచనాలు మధ్య ‘ది వారయర్’ చిత్రం జూలై 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

The Warrior: ‘ది వారియర్’ ప్రీరిలీజ్ బిజినెస్ రిపోర్ట్

కాగా, తొలిరోజే ఈ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో రానున్న రోజుల్లో ఈ సినిమా పుంజుకుంటుందని చిత్ర వర్గాలు భావించాయి. కానీ వీకెండ్ ముగిసినా ఈ సినిమా కలెక్షన్ల పరంగా పుంజుకోలేకపోయింది. కమర్షియల్ అంశాలతో రొటీన్ కథను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించడంలో ఈ సినిమా వెనకబడింది. దీంతో ఈ సినిమా కలెక్షన్లు అంతంత మాత్రంగా నమోదయ్యాయి. ఇక వీక్ డేస్‌లో ఈ సినిమా కలెక్షన్లు భారీగా డ్రాప్ అవుతూ వచ్చాయి.

The Warrior: ది వారియర్ 4 రోజుల కలెక్షన్స్.. ఎలా ఉన్నాయంటే?

ది వారియర్ సినిమా రిలీజ్ అయిన తొలి వారం ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.19.02 కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరగడంతో బ్రేక్ ఈవెన్‌కు రావడం ఈ సినిమాకు చాలా కష్టంగా మారిందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇక రామ్ రెండు విభిన్నమైన లుక్స్‌లో నటించిన ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా, ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కాగా ఏరియాలవారీగా ఈ చిత్ర ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 5.44 కోట్లు
సీడెడ్ – 2.88 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.27 కోట్లు
ఈస్ట్ – 1.26 కోట్లు
వెస్ట్ – 1.12 కోట్లు
గుంటూరు – 1.87 కోట్లు
కృష్ణా – 0.90 కోట్లు
నెల్లూరు – 0.61 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 16.35 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.95 కోట్లు
తమిళనాడు – 1.10 కోట్లు
ఓవర్సీస్ – 0.62 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 19.02 కోట్ల షేర్